Moviesక్రేజీ అప్డేట్: అఖిల్ మూవీలో మెగాస్టార్..వామ్మో ఏం స్కెచ్ గురూ..?

క్రేజీ అప్డేట్: అఖిల్ మూవీలో మెగాస్టార్..వామ్మో ఏం స్కెచ్ గురూ..?

వరసగా మూడు పరాజయాల తర్వాత బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి వచ్చి..ఆ రేంజ్ హిట్ కాకపోయిన ..ఏదో బాగుందిలే అన్న టాక్ తెచ్చున్నాడు అఖిల్..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా. అఖిల్ అక్కినేని తాజాగా నటించి విడుదలైన చిత్రం ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ “. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి నిర్మించారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించి..తన అందంతో మరోసారి కుర్రకారుని కట్టిపడేసింది.

కాగా.. అక్కినేని అఖిల్ ఇపుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు . ఈసినిమాకి ‘ఏజెంట్’ అనే పేరు ఖరారు చేసారు. ఈ చిత్రంలో అఖిల్ ఎంతో స్టైలిష్‌గా రఫ్‌గా ఉంది. ఒక ఏజెంట్ అంటే ఇలాగనే ఉంటాడు అనే తరహాలో ఉంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్‌ను కెటాయించారని సమాచారం.

అయితే తాజాగా లీకైన సమాచారం ప్రకారం..ఈ సినిమాలో మళయాళ మెగాస్టార్ మమ్ముటి కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ తమిళ పీఆర్వో శ్రీధ‌ర్ పిళ్లై త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో వెల్ల‌డించారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం త్వ‌ర‌లోనే అఖిల్, మ‌మ్ముట్టి యూర‌ప్‌కు వెళ్ల‌నున్నార‌ట‌. ఇక ఈ సినిమా కోసం మమ్ముటి ఏకంగా 4కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సిని ఇండస్ట్రీలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news