Gossipsఆ స్టార్ హీరోయిన్‌తో చిరంజీవికి ఎఫైర్‌..!

ఆ స్టార్ హీరోయిన్‌తో చిరంజీవికి ఎఫైర్‌..!

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నాలుగు ద‌శాబ్దాలుగా మ‌కుటం లేని మ‌హారాజుగా వెలుగొందుతున్నారు. 150కు పైగా సినిమాల్లో న‌టించిన చిరు 2007 త‌ర్వాత సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ అధికారంలోకి రాక‌పోయినా ఆ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికై కేంద్ర మంత్రి అయ్యారు. ఇక ఇప్పుడు సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తూ దూసుకు పోతున్నారు.

ఇదిలా ఉంటే అప్ప‌ట్లో చిరంజీవికి ఓ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ సాగించాడ‌న్న వార్త‌లు మీడియాలో వ‌చ్చేవి. అప్ప‌ట్లో ఏదైనా వార్త మీడియాలో వ‌చ్చింది అంటే పెద్ద సంచ‌ల‌న‌మే క‌దా..! ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు కోలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ రాధికా శ‌రత్‌కుమార్‌. ఈ పుకార్ల‌పై చిరంజీవి సైతం ఓ సంద‌ర్భంలో స్పందించారు. తాము చాలా స్నేహితులుగా ఉండే వాళ్ల‌మ‌ని… అది త‌మ సాన్నిహిత్యం చూసిన కొంద‌రు ర‌క‌రకాల అర్థాలు పెట్టేవార‌ని చిరు చెప్పారు.

అప్ప‌ట్లో రాధిక – చిరు కాంబినేష‌న్ అంటేనే ఓ క్రేజ్ ఉండేది. వీరి కాంబినేష‌న్లో వ‌చ్చిన ఎన్నో సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక చిరు యంగ్ ఏజ్లో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌తో పోటీప‌డి మ‌రీ డ్యాన్స్ చేసే హీరోయ‌న్ ఎవ‌రు అంటే ఒక్క రాధిక మాత్ర‌మే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news