Moviesమా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్‌కు బిగ్ ట్విస్ట్... రంగ‌లోకి బాల‌య్య‌..!!

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌రాజ్‌కు బిగ్ ట్విస్ట్… రంగ‌లోకి బాల‌య్య‌..!!

తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోన్న కొద్ది ర‌స‌వ‌త్త‌ర పోరు సాగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముందు ఐదుగురు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. వీరిలో హేమ‌, జీవిత ఇద్ద‌రూ కూడా ప్ర‌కాష్‌రాజ్ గూటికి చేరుకున్నారు. త‌ర్వాత తాను కూడా పోటీలో ఉన్నాన‌ని చెప్పిన సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్ న‌ర‌సింహారావు తో పాటు జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత‌పై పోటీ చేస్తున్న‌ట్టు స‌వాళ్లు రువ్విన బండ్ల గణేష్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

వీరిలో బండ్ల గ‌ణేష్ ప్ర‌కాష్‌రాజ్ ప్యానెల్‌కు ఇప్ప‌టికే త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ప్ర‌చారం హోరెత్తుతోంది. ఇక ఈ నెల 10నే మా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇంత‌లోనే మంచు విష్ణు ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల‌లో సీనియ‌ర్ న‌టుడు, నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ తనకే మద్ధతు ఇస్తున్నారని మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు విష్ణు సోష‌ల్ మీడియాలో బాలకృష్ణతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

న‌న్ను ఆశీర్వ‌దించి.. మా ప్రెసిడెంట్‌గా నాకు మ‌ద్ద‌తు ఇచ్చిన బాల అన్న‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పోస్ట్ చేశాడు. అఖండ సెట్‌కు వెళ్లిన సంద‌ర్భంగా బాల‌య్య‌తో ముచ్చ‌టించిన విష్ణుకు బాల‌య్య స‌పోర్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా మా వార్‌లో ప్ర‌కాష్‌రాజ్‌కు మెగా స‌పోర్ట్ ఉంది. ఇప్పుడు బాల‌య్య విష్ణుకు స‌పోర్ట్ చేస్తుండ‌డంతో మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news