Moviesబిగ్‌బాస్ 5: ఈ వారం డేంజ‌ర్ జోన్లో ఎవ‌రు..ఆ కంటెస్టెంట్ అవుటే...!

బిగ్‌బాస్ 5: ఈ వారం డేంజ‌ర్ జోన్లో ఎవ‌రు..ఆ కంటెస్టెంట్ అవుటే…!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 అప్పుడే ఐదో వారంలోకి కూడా ఎంట్రీ అయ్యింది. ఈ సారి హౌస్లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ష‌రా మామూలుగానే ఒక్కో వారం ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్పుడిప్పుడే షో ర‌క్తి క‌డుతోంది. ఇక మొద‌టి వారం ఎన్నో అంచ‌నాల‌తో హౌస్లోకి వెళ్లిన స‌ర‌యు ఎలిమినేట్ అయ్యింది.

ఇక రెండో వారం కార్తీక‌దీపం ఉమాదేవి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె కూడా త‌న‌పై ఉన్న అంచ‌నాలు నిల‌బెట్టుకోలేక‌పోయింది. ఇక మూడో వారం ల‌హ‌రి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 15 మంది సభ్యులు ఉండ‌గా.. వీరిలో ఎవ‌రు ఈ వారం బ‌య‌ట‌కు వ‌స్తారు ? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

ఈ వారం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లేందుకు హౌస్లో మొత్తం 9 మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో కొంద‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉంటే.. మ‌రి కొంద‌రు వీక్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం బ‌య‌ట న‌డుస్తోన్న చ‌ర్చ‌లు, ఆన్‌లైన్ పోల్స్‌ను బ‌ట్టి చూస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒక‌రు అయిన యాంకర్ రవి – విజే సన్నీ – షణ్ముఖ్ జశ్వంత్ – మానస్ – ప్రియ సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

ఇక బ‌య‌ట‌కు వెళ్లే లిస్టులో జెస్సీ – హమీద – విశ్వ – లోబో డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వీరంద‌రిలోనూ లోబోకే త‌క్కువ ఓట్లు ప‌డుతున్నాయంటున్నారు. ఈ లెక్క‌న ఈ వీక్లో అత‌డే ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news