Moviesఅద్దిరిపోయే డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ లో జోష్ నింపిన బాలయ్య.. ఆ వీడియోను...

అద్దిరిపోయే డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ లో జోష్ నింపిన బాలయ్య.. ఆ వీడియోను మీరూ చూడండి ..!!

నందమూరి హీరో బాలయ్య..ఏం చేసినా అది పెద్ద సెన్సేషన్ నే. ఆయన డైలాగ్ చెప్పిన, ఆయన పాట పాడిన, ఆయన డ్యాన్స్ చేసినా..ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి. తాజాగా నందమూరి హీరో కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఆహా వాళ్లతో కలిసి బాలకృష్ణ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హోస్ట్ గా చేయబోతున్నారు.

సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోరు మీదున్న ‘ఆహా’.. తాజాగా మరో సంచలనానికి తెర తీస్తోంది. ఓటీటీలో తొలిసారి ఓ టాక్‌ షోను నిర్వహించడానికి రంగ సిద్ధం చేసింది. ఇక మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ బాలకృష్ణ ఓటీటీ మాధ్య‌మంలోకి అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి బాలకృష్ణతో కలిసి టాక్‌ షో నిర్వహించనున్నాం అంటూ అధికారికంగా ప్రకటన చేసింది. ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ అనే సాలిడ్ పేరు ఫిక్స్ చేశారు. దీపావ‌ళి నుంచి ఈ టాక్ షో ప్ర‌సారం కానుంది.

తాజాగా ఆహా ఒరిజినల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రోగ్రాంలో నందమూరి బాలయ్య తన ఫ్యాన్స్‌లో మంచి జోష్ నింపారు. ఈ ప్రోగ్రాంలో ఆయన స్టేజిపైకి ఎంట్రీ ఇస్తూనే బ్యాగ్రౌండ్ నుంచి వస్తున్న మ్యూజిక్‌కు ఆయన మాస్ స్టెప్పులు వేస్తుంటే.. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత ఎనర్జీతో దుమ్ములేపుతున్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. మరి ఆయన స్టెప్పులేస్తూ దుమ్ములేపిన వీడియోను మీరూ చూడండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news