Gossipsఅక్కినేని మేన‌ళ్లుడు సుమంత్ జీవితంలో కీర్తిరెడ్డి కాక మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు..?

అక్కినేని మేన‌ళ్లుడు సుమంత్ జీవితంలో కీర్తిరెడ్డి కాక మ‌రో ఇద్ద‌రు హీరోయిన్లు..?

అక్కినేని వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మూడో త‌రంలో ఎంట్రీ ఇచ్చాడు ఏఎన్నార్ మ‌న‌వ‌డు సుమంత్‌. సుమంత్ కెరీర్ ప‌రంగా పెద్ద‌గా స‌క్సెస్ అయ్యింది లేదు. తొలిప్రేమ‌తో సూప‌ర్ పాపుల‌ర్ అయిన కీర్తిరెడ్డిని ప్రేమించి 2004లో పెళ్లి చేసుకున్నాడు సుమంత్. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో యేడాదికే 2005లో వీరు విడాకులు తీసుకున్నారు.

సుమంత్‌తో విడాకుల త‌ర్వాత కీర్తిరెడ్డి మ‌రో ఎన్నారైను పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. సుమంత్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇదిలా ఉంటే సుమంత్ కీర్తిరెడ్డికి విడాకులు ఇచ్చాక మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్లు న‌డిపాడ‌న్న వార్త‌లు అయితే అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ ఇన్స‌ర్ స‌ర్కిల్స్‌లో చ‌క్కెర్లు కొట్టేవి. సుమంత్ ప‌క్క‌న న‌టించిన ఛార్మి, కమలినీ ముఖర్జీతో సుమంత్‌కు ఎఫైర్లు ఉండేవ‌న్న‌దే అప్ప‌టి టాక్‌.

అయితే ఇందులో వాస్త‌వాలు ఎంతో తెలియ‌దు కానీ.. సుమంత్ వారితో సినిమాలు చేసిన‌ప్పుడే ఈ ప్ర‌చారం ఎక్కువుగా జ‌రిగి.. త‌ర్వాత గ‌ప్‌చుప్ అయిపోయింది. ఇక కీర్తిరెడ్డితో విడిపోయిన 16 ఏళ్ల‌కు సుమంత్ ఈ యేడాది మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే త‌ర్వాత ఇదంతా ఓ సినిమా ప‌బ్లిసిటీ కోస‌మే అన్న‌ది తేలింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news