Gossipsచైతు - స‌మంత విడాకుల వెన‌క స్టార్ హీరో... స్టార్ హీరోయిన్‌...?

చైతు – స‌మంత విడాకుల వెన‌క స్టార్ హీరో… స్టార్ హీరోయిన్‌…?

ఎప్పుడు ఎవ‌రు ? దొరుకుతారా ? ఏ కాంట్ర‌వ‌ర్సీ చేద్దామా ? అని కంగ‌నా ర‌నౌత్ వెయిట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల‌కు అమీర్ ఖాన్‌కు లింక్ పెట్టి పోస్టులు పెడుతోంది. ఈ జంట విడాకుల త‌ర్వాత కంగ‌నా స్పందిస్తూ విడాకులు ఇచ్చిన సౌత్ హీరో కొద్ది రోజుల క్రిత‌మే ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ను క‌లిశాడ‌ని.. ఆ వెంట‌నే త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడ‌ని రాసుకొచ్చింది. స‌ద‌రు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ విడాకుల స్పెష‌లిస్ట్‌గా పేరుంద‌ని కూడా పేర్కొంది.

అమీర్-చైతూ కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేశారు. ఇక చైతు ల‌వ్ స్టోరీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా అమీర్ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం అమీర్ త‌న భార్య కిర‌ణ్‌రావుకు విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు చైతు కూడా విడాకులు ఇచ్చాడు. అందుకే కంగ‌న వీరిద్ద‌రికి లింక్ పెట్టి ప‌రోక్షంగా అమీర్‌ను ఆటాడుకుంది. అక్క‌డితో ఆగ‌ని ఆమె విడాకుల వ్య‌వ‌హారంలో త‌ప్పు ఎప్ప‌డూ మ‌గాడిదే అని.. మ‌గాళ్లు వేట‌గాళ్లుగా… ఆడ‌వాళ్లు బ‌లి ప‌శువులుగా మార‌డం ఆన‌వాయితీ అయ్యింద‌ని ఆవేద‌న చెందింది.

ఇదిలా ఉంటే ఈ విడాకుల వ్య‌వ‌హారంలో మ‌రో హీరోయిన్ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. చైతు – సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ఉన్నార‌ని.. ఆమెను పెళ్లి చేసుకునే క్ర‌మంలోనే చైతు స‌మంత‌కు విడాకులు ఇచ్చేశాడ‌ని కొంద‌రు గాసిప్ రాయుళ్లు రాస్తున్నారు. ఇటీవ‌లే వ‌చ్చిన చైతు హిట్ సినిమా ల‌వ్ స్టోరీలో చైతు – సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు. మ‌రి ఇందులో వాస్త‌వాలు ఏమో గాని ఎవ‌రికి తోచిన‌ట్టు వారు రాసుకు పోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news