Moviesఅతి త్వరలోనే..షాక్ ఇస్తూ స్వీట్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మాజీ...

అతి త్వరలోనే..షాక్ ఇస్తూ స్వీట్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌..!!

అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరుగురిచి పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో బాగా పాపులర్ అయిన బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసినవారిలో అలీ ఒకరు. ముఖ్యంగా ఫిజికల్‌ టాస్కుల్లో గట్టిపోటీనిస్తూ ఇతర కంటెస్టెంట్లకు చెమటలు పట్టించిన అలీ .. ఎలిమినేట్‌ అయినప్పటికీ తిరిగి వైల్డ్‌కార్డ్‌ ద్వారా హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

నిజానికి బిగ్ బాస్ ముందు ఈయన పరిచయం గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ తర్వాత తనేంటో తాను నిరూపించుకున్నాడునాగార్జున న‌టించిన‌ వైల్డ్ డాగ్ చిత్రంలో న‌టించే ఛాన్స్ అందుకున్నారు. అయితే ఈ చిత్రం అలీకి ఆశించినంతగా పేరు తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం ఆహ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తన మూవీ అప్డేట్స్‌తో పాటు.. పర్సనల్ విషయాలను షేర్ చేసుకునే అలీ రెజీ.. తన అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తూ వీడియో ద్వారా గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. చిటికేసి మరి గుడ్ న్యూస్ చెప్పాడు అలీ. భార్య‌తో క‌లిసి ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో ఆయ‌న భార్య మ‌సూమ బేబి బంప్‌తో క‌నిపిస్తుంది.

ఈ దంప‌తులు ఇద్ద‌రికి సెల‌బ్స్, నెటిజ‌న్స్ శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. మ‌సూమ బిగ్ బాస్ షోలో అలీని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రస్తుతం మ‌సూమకి సంబంధించిన బేబి బంప్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక్ అలీ రెజా.. తెలుగు సినీ ఇండస్ట్రీకి అమృతం చందమామ అనే సినిమాతో 2014లో పరిచయమయ్యాడు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలో నటించాడు అలీ. ఇక సీరియల్స్ కు దూరంగా ఉంటూ సినిమాలతో బాగా బిజీ అయ్యాడు. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Ali Reza (@i.ali.reza)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news