Moviesయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాపై ఆ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాపై ఆ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు.

ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నవని బడా ప్రజెక్ట్ లే. రాధేశ్యాం, సాలార్, ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ ఆరు అడుగుల అందగాడు. ఇప్పటికే రాధేశ్యాం సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం సాలర్ సినిమా, ఆది పురుష్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా లైన్లో ఉన్నాయి. ఇక దీంతో పాటు ఆయన తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాని నిర్మాత దిల్ రాజుతో కలిసి చేస్తున్నారు.

నాగ్ అశ్విన్ సినిమా కథ ఓ సూపర్ హీరో చుట్టూ తిరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో అంతర్జాతీయ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మరి ప్రభాస్ ఎలాంటి సూపర్ హీరో పాత్రలో నటిస్తాడా అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా నిర్మాత అశ్వినీ దత్‌ ఈ చిత్రముచ్చట్లను చెప్పుకొచ్చారు. ‘నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుంది. కాగా ఈ సినిమాలో అదిరిపోయే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news