Moviesషాకింగ్: ఆ సినిమా కోసం ప్రభాస్ ఎప్పుడు చేయని రిస్క్ చేస్తున్నాడట..?

షాకింగ్: ఆ సినిమా కోసం ప్రభాస్ ఎప్పుడు చేయని రిస్క్ చేస్తున్నాడట..?

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

ఇక యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న మరో సినిమా ఆదిపురుష్. రామాయ‌ణంలోని ఓ ఘ‌ట్టాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కే ఈ సినిమాలో లంకేశ్‌గా బాలీవుడ్ న‌టుడు సైఫ్ ఆలీఖాన్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించే ఈ సినిమాలో హీరోయింగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. దిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు.

బాహుబలి కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలిసిందే. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఇక అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే..ఈ సన్నివేశాలను ప్రభాస్ డూప్ లేకుండా చేయనున్నారట. దానికోసం ఎంతో భారీ స్టంట్స్ రిహార్సల్స్ చేయడం స్టార్ట్ చేసాడట ప్రభాస్. ఇక ఈ మూవీ షూటింగ్ ను వచ్చే నెలలోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారనే టాక్ సినీ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news