Moviesవామ్మో..పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అంత భయంకరమైనదా..??అంచనాలు పెంచేసిన శ్రీవల్లి..!!

వామ్మో..పుష్ప సినిమాలో రష్మిక పాత్ర అంత భయంకరమైనదా..??అంచనాలు పెంచేసిన శ్రీవల్లి..!!

రష్మిక మందన.. ఓ వైపు టాలీవుడ్..ఓ వైపు బాలీవుడ్..మధ్యలో కోలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాక నేషనల్ వైడ్‌గా స్టార్ హీరోయిన్ గా తన సత్త చాటుతున్న భామ రష్మిక అనే చెప్పాలి. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.

రష్మిక మందన్న మనకున్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశంలో బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారామె. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటింస్తుంది రష్మిక. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా పుష్ప చిత్రం నుండి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. భయంకరమైన ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లిని పరిచయం చేశారు. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఆ పోస్టర్ లో శ్రీవల్లి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. అయితే అందులో ఆమె రెడీ అవుతున్న విధానం, ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే తనకు ఇష్టం లేకుండానే సిద్ధమవుతున్నట్టు అన్పిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news