Moviesఆ విషయంలో ఆతృతగా ఉందన్న నాగార్జున..ఎందుకో తెలుసా..??

ఆ విషయంలో ఆతృతగా ఉందన్న నాగార్జున..ఎందుకో తెలుసా..??

కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి.

కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది.ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బంగార్రాజు’ సినిమాలో ఛాన్స్ పట్టేసింది కృతి. సెప్టెంబర్ 21 ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ కృతి శెట్టి క్యారెక్టర్ రివీల్ చేసింది చిత్రయూనిట్. నాగలక్ష్మిగా కృతి నటిస్తోందని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న నాగార్జున.. “వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే డియర్ కృతి శెట్టి.. నిన్ను బంగార్రాజు సెట్స్‌లో కలవాలని ఆతృతగా ఉంది” అని పేర్కొన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news