ఎన్నొ భారీ అంచనాల మధ్య బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక రచ్చలు,అరుపులతో సోమవరం నుండి శుక్ర వారం వరకు హాట్ హాట్ గా ఉంటుంది. ఈ క్రమంలో నాగారజున శని,ఆదివారాలో వచ్చి కంటెస్టేంట్లకు క్లాస్ పీకుతుంటారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోద్ లో బిగ్ బాస్ హౌ స్టేజ్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద చెర్రీ సందడి చేశాడు. ఇదే క్రమంలో నాగార్జున, రామ్ చరణ్ కాసేపు ముచ్చటించుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం, ఆ ప్రోమోలో షో మ్యాన్‌లా రామ్ చరణ్ అదరగొట్టడంపై నాగార్జున ఓ రెంజ్ లో పొగిడేసారు. ఇక ఆ తరువాత చరణ్ మాస్ట్రో టీం నితిన్, తమన్నాలు కూడా స్టేజ్‌పై సందడి చేశారు.
ఇక అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని.. కోలుకుంటున్నాడు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని రామ్ చరణ్ అన్నాడు. ఆ దేవుడి దయ వల్ల సాయి ధరమ్ తేజ్ త్వరగానే కోలుకుంటాడు అని నాగార్జున కూడా అన్నాడు. అలా మొత్తానికి బిగ్ బాస్ వేదిక మీదుగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఈ నెల 10వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోడ్డు వైపు వెళ్తుండగా సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఆయనకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న వారు ఆయనని హుటాహుటిన మెదికోవర్ హాస్పిటల్ కి తరలించారు. ఇక అక్కడే ఆయనకు గోల్డెన్ హవర్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ కోలుకుంటున్నారు.