Moviesబాక్సాఫీస్ వ‌ద్ద ల‌వ్‌స్టోరీ వ‌సూళ్ల ఊచ‌కోత‌... ఆ టార్గెట్ ఊదేస్తుందా...!

బాక్సాఫీస్ వ‌ద్ద ల‌వ్‌స్టోరీ వ‌సూళ్ల ఊచ‌కోత‌… ఆ టార్గెట్ ఊదేస్తుందా…!

నాగ‌చైత‌న్య – సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్లో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లవ్ స్టోరీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను నమోదు చేసింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత చాలా రోజుల పాటు థియేట‌ర్లు మూసి వేయ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా విల‌విల్లాడింది. థియేట‌ర్లు తెర‌చినా జ‌నాలు వ‌స్తారా ? రారా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో వ‌చ్చిన ల‌వ్‌స్టోరీ మంచి పాజిటివ్ బ‌జ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు ముందు నుంచే హిట్ టాక్ కూడా వ‌చ్చింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా భారీ ఎత్తున వ‌చ్చాయి.

ఇక శ‌నివారంతో పాటు ఆదివారం కూడా హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ల‌వ్‌స్టోరీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల‌లో రు. 20 కోట్ల షేర్ దాటేసింది. నైజాంలోనే రు. 10 కోట్ల‌కు చేరువ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ల‌వ్ స్టోరీకి రు. 20 కోట్ల మార్క్ అనేది ఉఫ్ అన్న‌ట్టుగా ఉంది. ఓవ‌రాల్‌గా లాంగ్ ర‌న్ పూర్త‌య్యే స‌రికి ఈ సినిమా రు. 35 నుంచి రు. 40 కోట్ల మార్క్‌కు చేరువ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్లు ఓపెన్ అయినా కూడా ఈ సినిమాకు అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రావ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది. ఇక యూఎస్‌లో రెండు రోజుల్లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌ను బీట్ చేసింది. లాంగ్ ర‌న్‌లో మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌స్తాయంటున్నారు. యేడాదిన్న‌ర కాలంగా సినిమా కోసం మొఖం వాచి ఉన్న అక్క‌డ తెలుగు ప్రేక్ష‌కులు ల‌వ్‌స్టోరీ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

ఏదేమైనా ల‌వ్‌స్టోరీ సినిమా ద‌స‌రాకు వ‌స్తోన్న పెద్ద సినిమాల‌కు మంచి దారి చూప‌డంతో పాటు వ‌ణికిపోతోన్న టాలీవుడ్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news