Moviesకస్తూరి సీరియల్ పరం రీయల్ లైఫ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

కస్తూరి సీరియల్ పరం రీయల్ లైఫ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

బుల్లితెర మీద సీరియల్స్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు బుల్లితెరపై సిరియల్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అందుకే అన్ని సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ధారావాహికంగా నడుస్తున్నాయి. ట్వ్ సీరియల్స్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇక స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కస్తూరి సీరియల్ కొద్దికాలంలోనే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ నటనతో,అందంతో అలరిస్తున్నారు. అందుకే మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది.

ఇందులో హీరోగా నటిస్తున్న పరంధామయ్య..అందరికి తెలిసే ఉంటుంది. తన అందంతో,నటనతో కొద్ది కాలంలోనే ప్రేక్షకుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు. సీరియల్ లో క్యారెకటర్ పేరు పరంధామయ్య..కానీ నిజ జీవితంలో ఈయన పేరు నాగార్జున్. ఇక ఈయన కర్ణాటకలోని మైసూరులో జులై 27న జన్మించాడు. చిన్నప్పటి నుంచి నాగార్జున్ కి నటన అంటే చాలా ఇష్టమట. ఎంత ఇష్టమంటే స్కూల్, కాలేజ్ డేస్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగితే అందరికన్న ముందు నాగార్జున్ లేచి ప్రోగ్రాం కి నేం ఇచ్చేవాడట.

నటన పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా చదువును మాత్రం వదలలేదట. చదువు పూర్తి అయిన తరువాతే నాగార్జున్ తొలిసారిగా గిరిజా కళ్యాణం అనే సీరియల్ లో నటించి..ఫ్స్ట్ సీరియల్ తోనే కన్నడ ఆడియన్స్ తన వైపు తిప్పుకున్నాడు ఈయన. ఇక ఆ నటనతో శాంతం పాపం, అగ్నిసాక్షి, మారాలి బంధాలు వంటి సీరియల్స్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం యాక్టర్ గానే కాకుండా మోడల్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదండోయ్.. కన్నడ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కన్నడలో నాగిని 2, అలాగే తెలుగులో కస్తూరి సీరియల్స్ చేస్తూ బుల్లితెర పై మెరిసిన ఈయన వెండి తెర పై మెరవడానికి ఎదురు చూస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news