Moviesఇక పై ఆ హీరోయిన్ తో సినిమాలు చేయను..విజయ్ సేతుపతి కి...

ఇక పై ఆ హీరోయిన్ తో సినిమాలు చేయను..విజయ్ సేతుపతి కి పిచ్చ కోపం వచ్చిందట..?

ప్రస్తుతం తమిళ హీరోలు తెలుగు తెర పై దండయాత్ర మొదలు పెట్టిన్నట్లు అనిపిస్తుంది. వరుస గా ఒకరి తరువాత ఒకరు తమిళ హీరోలు తెలుగులో పాగా వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. తమిళ స్టార్ అయినటువంటి చ్.. హీరోగా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను డిఫ‌రెంట్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు

విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు హీరోలను బాగా ఆకట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా లో ఉండే విధంగా కొందరు హీరోలు, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట. రీసెంట్ గా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఉప్పెన మూవీ తరువత విజయ్ సేతుపతి హీరోగా..ఆ సినిమాలో హీరోయిన్ గా కృతిని ఎంపిక చేసేందుకు గాను మేకర్స్ ప్రయత్నించారట. అయితే ఆ నిర్ణయాన్ని విజయ్ సేతుపతి కొట్టిపాడేశాడు. ఎందుకంటే..”నా కొడుకుకు 15ఏళ్లు. ఇప్పుడు కృతి వ‌య‌స్సు 17 ఏళ్లు. నా కూతురి లాంటి వ్య‌క్తితో క‌లిసి న‌టించ‌లేను అని.. కూతురిలా భావించిన అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాను చెప్పండి” అంటూ.. యూనిట్ సభ్యుల పై మండిపడ్డాడట విజయ్. అయితే ఇక్కడ షాకింగ్ ఏమిటంటే ఉప్పెనలో కృతి శెట్టికి విజయ్ కి తండ్రిగా నటించిన విషయం ఆ సినిమాయూనిట్‌ సభ్యులకు తెలియదట. ప్రస్తుతం విజయ్ సేతుపతి మోస్ట్ బిజీ హీరో కమ్ నటుడు. ఆయన వరుసగా చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకుంటున్న కారణంగా ఆఫర్లు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి.

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news