Moviesఫస్ట్ కిస్ ఆ అమ్మాయితోనే..సీక్రెట్ రివీల్ చేసిన మెగా హీరో..!!

ఫస్ట్ కిస్ ఆ అమ్మాయితోనే..సీక్రెట్ రివీల్ చేసిన మెగా హీరో..!!

మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ కెరియర్ లో కమర్షియల్ హిట్ కొట్టడం లేట్ అయినా సరే ఫిదా హిట్ తో తన రేంజ్ ఏంటో చూపించేశాడు. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ కంచెతో మంచి ప్రయత్నం చేసినా ఆ తర్వాత సినిమాలు అతనికి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇక శేఖర్ కమ్ముల ఫిదాతో ఒక్క సారిగా హిట్ మజాని ఎంజాయ్ చేసిన వరుణ్ తేజ్ ఆ ఎఫెక్ట్ తో డేరింగ్ స్టెప్పులు వేసుకుంటూ పోతూ..తనదైన స్టైల్ లో హిట్ లు కొడుతున్నారు.

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గనీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం వరుణ్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ హీరో.. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని మార్చేశాడు. అలాగే ఎప్పటికప్పుడూ జిమ్‏లో కఠోరమైన వ్యాయమాలు చేస్తున్నాడు.

అయితే తాజాగా ఈయన కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ మంచు లక్ష్మి ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ లో తన అభిమానులుకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే మంచు లక్ష్మి.. వరుణ్ నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది..?? ఎవరితో జరిగింది..? అని అడగగా…. అందుకు వరుణ్ నవ్వుతూ ..టెన్స్ క్లా లో ఒక అమ్మాయికి ముద్దు ఇచ్చానని చెపుతూ..ప్లీజ్ ఇకపై ఈ విషయం గురించి ఏమీ అడగద్దు అంటూ ఆ టాపిక్ అక్కడితో కట్ చేసాడు. అలా తన ఫస్ట్ కిస్ సీక్రేట్ గురించి వరుణ్ రివీల్ చేసాడు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news