Moviesఈ బిగ్ బాస్ విన్నర్ సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటో...

ఈ బిగ్ బాస్ విన్నర్ సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా..?

బిగ్‏బాస్ తెలుగు ఎంతో మంది కంటెస్టెంట్లకు గుర్తింపునిచ్చింది. బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్యక్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా ముగియ‌డంతో సెప్టెంబ‌ర్ 5 నుండి సీజ‌న్ 5 మొద‌లైంది. ఈ సీజ‌న్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండ‌గా,వారి మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. అయితే సీజ‌న్ 4లో కూడా వాడివేడిగా పోటీ జ‌ర‌గ‌గా, చివ‌ర‌కు అభిజీత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ఇక బిగ్‏బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజీత్.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక.. అతని ఆటతీరుతో విపరీతమైన పాపులారిటీని సంపాదించారు. అభిజిత్ బిగ్‏బాస్ కు వెళ్ళకు ముందే శేఖర్ కమ్ముల తెరెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు పొందాడు.

ఆ సినిమా తర్వాత అభిజిత్ అంతగా సినిమాల్లో నటించలేదు. చాలా కాలం తర్వాతా తిరిగి బిగ్‏బాస్ షోలో పాల్గోని మరింత ఫేమస్ అయ్యాడనడంలో సందేహం లేదు. హౌస్ లో మిస్టర్ కూల్‌గా ఆట ఆడి కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినీ హీరో అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అవతరించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్‌ను అందుకున్నాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్నర్‌గా అభిజిత్‌కు ఎనలేని ఫాలోయింగ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్‌ను అభిజిత్ సరైన పద్దతిలో వినియోగించుకోవడం లేదనిపిస్తోంది. బిగ్ బాస్ ఐదో సీజన్ కూడా ప్రారంభమైంది. కానీ అభిజిత్ నుంచి కొత్త సినిమా ప్రకటనలు మాత్రం రాలేదు.

అఅప్పుడెప్పుడో మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు వింటున్నాని చెప్పిన ఆయన ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫైనల్ చేయలేదు. అయితే, అభిజీత్ సినిమా లు ఒపుకోకపోవడానికి కారణం ఆయన ఆరోగ్యం అనే తెలుస్తుంది. అభిజిత్ తన ఆరోగ్య సమస్యలతోనే సతమతమవుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అంతేకాకుండా అభిజీత్ కూడా ముందుగా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ బిగ్ బాస్ విన్నర్ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు? అని నెటిజన్లు పదే పదే అడుగుతుండటంతో అలా సమాధానం ఇచ్చారు అభిజీత్. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news