Gossipsఅమ్మ బాబోయ్..ఆ లిమిట్స్ క్రాస్ చేస్తున్న దిల్ రాజు..బెడిసికొడితే జింతాక జితా...

అమ్మ బాబోయ్..ఆ లిమిట్స్ క్రాస్ చేస్తున్న దిల్ రాజు..బెడిసికొడితే జింతాక జితా జితా..?

దిల్ రాజు ..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటున్నట్లు..వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ..ఒకప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి .. ఈ రోజు ఇండ‌స్ట్రీని శాసించే వ్య‌క్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రు. డిస్ట్రిబ్యూష‌న్‌, నిర్మాత‌గా, ఎగ్జిబిట‌ర్‌, థియేట‌ర్ల సిండికేట్‌లో ఒక కీల‌క వ్య‌క్తిగా ఆయ‌న చ‌క్రం తిప్పుతార‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండ‌దు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న హ‌వా న‌డుస్తోంది. పెద్ద హీరోలు, ద‌ర్శ‌కుల‌తో క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది.

బ‌డా బ‌డా ప్రాజెక్టుల‌ను మంచి నీళ్లు తాగినంత సులువుగా సెట్ చేసి ప‌డేస్తారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాని వెన‌క ఆయ‌న లెక్క‌లు వేరేగానే ఉంటాయి. టాలీవుడ్ లో సరైన కథలను ఎంపిక చేసుకోవటంలో గాని…. సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేసి డిస్ట్రిబ్యూషన్ చేయడంలోగాని దిల్ రాజుకు దిల్ రాజే సాటి అన్న పేరు ఉంది. దిల్ రాజు ఓ మంచి కథను ఎంచుకొని సరైన డైరెక్టర్‌తో సినిమా చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు అన్న విషయం గతంలో చాలాసార్లు రుజువయ్యింది. ఇక దిల్ రాజు ఒక సినిమాను పంపిణీ చేస్తున్నాడు అంటే… ఆ సినిమా రిలీజ్‌కు ముందే సగం హిట్ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉండేది. ఇండస్ట్రీపై రాజుకు అంత ఖచ్చితమైన గురి ఉండేది.

అయితే, 20 ఏళ్ల నిర్మాణంలో ఏ రోజు బడ్జెట్ లిమిట్ క్రాస్ చేయలేదు ఈయన. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈయన తన ట్రాక్ మారుస్తున్నాడు. వరుసగా భారీ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవుతున్నాడు. ఒక్కో సినిమాకు వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు దిల్ రాజు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా కు ముహూర్తం పెట్టాడు దిల్ రాజు. అలాగే వంశీ పైడిపల్లి, దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మరో బిగ్గెస్ట్ కాంబినేషన్ లో విజయ్ కి దాదాపు 80 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఐకాన్ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్ల పై మాటే. రాబోయే మూడు నాలుగు సినిమాలకు దాదాపు 1000 కోట్ల బడ్జెట్ సెట్ చేసుకుంటున్నాడు. ఈ దెబ్బతో దిల్ రాజు పేరు ఇండియాలో మార్మోగిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news