Moviesఆసక్తికరంగా "ఆకాశవాణి" ట్రైలర్‌..స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్..!!

ఆసక్తికరంగా “ఆకాశవాణి” ట్రైలర్‌..స్పెషల్ అట్రాక్షన్ గా ప్రభాస్..!!

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి. ఈ సినిమాను పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను ‘సోనీ లైవ్‌’ ఓటీటీ వేదికగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ యూనిట్‌ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. అశ్విన్ గంగరాజు ఎంతో చక్కగా ఈ సినిమా తెరకెక్కించిన్నట్లు అర్ధమౌతుంది. అడవిపైనే ఆధారపడి ఒక గూడెం వాసులు బ్రతుకుతూ ఉంటారు. అయితే ఒక దొర వాళ్ల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, వాళ్ల జీవితాలను శాసిస్తూ ఉంటాడు. ఎవరైనా తన మాటకి ఎదురు చెబితే వాళ్లని ఆ దొర చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటాడు.

దాంతో వాళ్లు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఉంటారు. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని అందించాడు. సముద్రఖని, వినయ్ వర్మ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. రఘువరన్ బీటెక్, విఐపి-2 చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి చేరువైన తమిళ నటుడు పి సముద్రఖని క్రాక్ సినిమాతో విలన్ పాత్రలో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. ఇక ఆకాశవాణి సినిమాతో పాజిటివ్ పాత్రలో సముద్రఖని మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news