Newsకొంప ముంచిన మల్లెపూలు..భర్తను కసాకసా నరికేసిన భార్య..చివర్లో షాకింగ్ ట్విస్ట్..!!

కొంప ముంచిన మల్లెపూలు..భర్తను కసాకసా నరికేసిన భార్య..చివర్లో షాకింగ్ ట్విస్ట్..!!

అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. భార్య, భర్తల మధ్య గొడవలు కామనే. కానీ చిన్న విషయాలకు ఘర్షణ పడటం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. కానీ ఇక్కడ ఓ భార్య ఏకంగా తన భర్త ని కిరాతకంగా హతమార్చిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఈ విచిత్ర ఘటన బీహర్ రాష్ట్రంలో జరిగింది. అసలు విషయం తెలిసీ పోలీసులు ఖంగుతిన్నారు.

పూర్తి వివరాలోకి వెళ్లితే..రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా బలపురాలో దేవీసింగ్ , పింకీ అనే భార్య భర్తలు ఉండేవారు. వీరి కాపురం ఎంతో అన్యున్యంగా సాగేది. పచ్చటి సంసారంలో ఎవరు కళ్లు పడ్డాయో ఏమో..రాను రాను వాళ్ల మధ్య అపోహలు, మన్స్పర్ధలు పెరిగిపోయాయి. తరచూ మల్లెపూలు తెచ్చే భర్త.. కొన్నాళ్లుగా మల్లెపూలు తీసుకురాకపోవడంతో..ఇంటికి కూడా సరిగా రాకపోవడంతో.. భార్య పింకీ కి అనుమానం వచ్చింది. పూలు ఎందుకు తీసుకురావడం లేదని నిలదీసింది. దీంతో భర్త వ్యాపారంలో పనులు బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ మాటాలు అసలు నమ్మలేదు భార్య. పింకీ కి తన భర్త ఎవరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అనుమానం వచ్చింది. దీనిపై భార్యభర్తలు ఇద్దరు తరచు గొడవలు పడేవారు.

భార్యకి అనుమానం పీక్స్ కి వెళ్లిపోయి తన భర్తను చంపేయాలి అని డిసైడ్ అయ్యింది. దీనికి పింకీ చెల్లెలి కూతురి భర్త కులదీప్ సింగ్ తో పాటు మరో ఇద్దరితో కలైసి మర్డర్ స్కెచ్ వేసింది. అనుకున్న విధంగనే ఆగస్ట్ 22న దేవీసింగ్‌ను మెడపై కత్తి వేట్లతో కసాకసా నరికి చంపారు. అంతా చేసేసి భార్య ఏం తెలియన్నట్లు భర్త శవం దగ్గర కూర్చుని లభోదిభో అని ఏడుస్తూ పక్కింటి వాళ్లని కేకేసింది. ఆ తర్వాత వాళ్లు బైక్‌పై పారిపోయారు. వాళ్ల చేతుల్లో రక్తం కారుతున్న కత్తులు చూసి స్థానికులు కళ్లు పెద్దవి చేశారు. సమాచారం అందుకున్న ఘటనస్దలానికి చేరుకుని.. శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోలీసుల విచారణలో దేవీసింగ్‌కి శత్రువులు లేరని తేలింది. మరైతే ఆ రేంజ్‌లో ఎందుకు చంపారన్నది తేలలేదు. దాంతో పోలీసుల ఫోకస్ పింకీపై పడింది. వాళ్ల స్టైల్ లో విచారించగా ..భయంతో పింకీ కూడా నిజం ఒప్పేసుకుంది. ప్రస్తుతం నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారు. వాళ్లను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news