Moviesనాగార్జునకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఆ హీరో..ఎప్పటికి మర్చిపోలేడు..??

నాగార్జునకు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఆ హీరో..ఎప్పటికి మర్చిపోలేడు..??

తరుణ్..ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఎందుకంటే..చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంటర్ అయి.. మంచి మంచి సినిమాలు తీసీ.. తన పేరును ర్వరు మర్చిపోకుండా ఉండేలా ఎన్నో అధ్బుతమైన సినిమాలో నటించాడు. ఇంకా తల్లి రోజారమణి సపోర్ట్ కూడా ఉండడంతో తరుణ్ కు టాలీవుడ్ పరిశ్రమ మరింత దగ్గరైంది. అయితే చిన్నతనంలోనే అందరిని ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

అయితే నటుడిగా తరుణ్ ఎన్నో సినిమాలు చేసాడు..వటిలో ఆల్ మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ నే. కానీ తరుణ్ ఎంటైర్ సినీ కెరీర్ లో “నువ్వే కావాలి” సినిమా టాలీవుడ్ సినీ చరిత్రను తిరగరాసింది. ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తే.. పనులు మానుకుని మరీ ఈ సినిమాను చూసెస్వారు ఉన్నారు అనడంలో సందేహంలేదు. హీరోగా రిచా హీరోయిన్ గా విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నువ్వే కావాలి.

అంతకుముందు బాల నటుడిగా పలు సినిమాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ తో దూసుకెళ్లిన తరుణ్ తొలిసారిగా నటించిన నువ్వేకావాలి ద్వారా అత్యద్భుతమైన విజయాన్ని అందుకొని గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నాడు. కాగా ఈ సినిమాకు గాను కోటి అందించిన మ్యూజిక్ కూడా అప్పట్లో అది పెద్ద సంచలనం గా సక్సెస్ సాధించింది. ఈ సినిమా ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా అవార్డు దక్కించుకుంది. ఇక దీనితో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.

అయితే నువ్వేకావాలి సినిమా రిలీజ్ అయిన.. అదే సంవత్సరంలో నాగార్జున నటించిన ఆజాద్ సినిమా మూవీ కూడా విడుదలైంది.. కాగా,ఆ సినిమా బాక్స్ అఫిస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ నువ్వేకావాలి సినిమా విడుదలయ్యి 20 కోట్ల రూపాయల వరకు షేర్ ను కొల్లగొట్టింది. ఇక ఈ విషయంలో తరుణ్ ..నాగార్జునకు మర్చిపోలేని షాక్ ఇచ్చినట్లైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news