Moviesఆ హీరోయిన్ గూబ గుయ్యమనిపించిన హీరో తండ్రి.. ఎందుకో మీరే చూడండి..??

ఆ హీరోయిన్ గూబ గుయ్యమనిపించిన హీరో తండ్రి.. ఎందుకో మీరే చూడండి..??

మంచు మోహన్ బాబు..తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌బాబు నటుడిగా..దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి సొసైటీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన “స్వర్గం నరకం” చిత్రంలో నటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఆయన దాదాపు 500 సినిమాలలో నటించడం విశేషం.

మోహన్ బాబు వారసత్వం అందిపుచ్చుకుని.. మంచు మనోజ్..మంచు విష్ణు.. మంచు లక్ష్మి వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఈ సినిమా రంగంలో రాణిస్తున్నారు. అయితే మోహన్ బాబు ఓ హీరోయిన్ ని కొట్టారనే షాకింగ్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది.

మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు హీరోగా పరిచయం అయిన విష్ణు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి శివానంద్ చెల్లి శిల్పా శివానంద్ నటించి.. అందరి దగ్గర మంచి మార్కులే వేయించుకుంది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ టైంలో శిల్పా శివానంద్ పదేపదే షూటింగ్‌కు డుమ్మా కొట్టడంతో పాటు దర్శకుడు సాజి కైలాష్‌ను ముప్పు తిప్పలు పెట్టిందని..ఆమె చేష్టలతో విసిగిపోయిన మోహన్ బాబు ఆమె చెంప చళ్లుమనించారట. దీంతో అప్పట్లో శిల్పా మోహన్ బాబు పై తీవ్ర ఆరోపణలు చేసింది. పాపం మోహన్ బాబుకు క్రమ శిక్షణ్.. టైమింగ్ గురించి పాపకి తెలియదు అనుకుంటా..అముకే విసిగించి కొట్టించుకుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news