Gossipsషాకింగ్: అమ్మని చేస్తానన్న స్టార్ డైరెక్టర్.. రష్మిక ఏం చేసిందో తెలుసా..??

షాకింగ్: అమ్మని చేస్తానన్న స్టార్ డైరెక్టర్.. రష్మిక ఏం చేసిందో తెలుసా..??

టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక మందన ఒకరు అనే చెప్పాలి. టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి సక్సెస్ ను సొంతం చేసుకు కోవడంతో పాటు అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆతర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించి.. తన కెరీర్ కు ప్లస్ గా మార్చుకుంది. అమ్మడు లక్ బాగుండటంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకెముంది పాప వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూకట్టాయి.

రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు ఓకే చెప్పి సంతకాలు చేసింది. మరో వైపు తమిళంలో కూడా వరుసగా సినిమాలను చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే కార్తి హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో అక్కడ అడుగు పెట్టింది రష్మిక. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇక తాజాగా అమ్మడుకి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. ఓ బడా బాలీవుడ్ దర్శకుడు..రష్మికతో సినిమా చేద్దామని సంప్రదిస్తే బేబీ నో చెప్పిందట..ఎందుకో తెలుసా..??

ఆ సినిమాలో హీరో భార్య పాత్రలో ఆమెను నటింప చేయాలని దర్శకుడు కండీషన్ పెట్టాడట. అంతేకాదు ఈ సినిమాలో ఆమె 10 సంవత్సరాల పాపకు తల్లిగా చేయాల్సిన పాత్ర అని.. అలాంటి పాత్రలో నటించే కథ ఆమెకు చెప్పగా .. రష్మిక ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం డైరెక్ట్ హీరోయిన్ల పాత్రలే బాగా వస్తున్నాయి.. ఇలాంటి సమయంలో తల్లి పాత్రలు చేయడం తన కెరీర్ కి మైనస్ అవుతుందని.. ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట రష్మిక. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చేసింది కొన్ని సినిమాలే అయినా రష్మిక కు ఈ రేంజ్ లో క్లారిటీ ఉండడం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.. మరి సౌత్ లో ఇప్పటికే ఇరగదీస్తున్న రష్మిక బాలీవుడ్ లో ఎలాంటి హీరోయిన్ గా ఎదుగుతుందో చూడాల్సిందే..!!

Latest news