Newsబిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్..వామ్మో..ఇక తినలేరేమోగా..!!

బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్..వామ్మో..ఇక తినలేరేమోగా..!!

భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. పండుగ అయినా పబ్బం అయినా, సందర్భం ఏదైనా.. ప్రతి ఫంక్షన్ లోనూ బిర్యానీ ఇప్పుడు కామన్ అయిపొయింది. ఇక హోటల్ లో నోరూరించే రకరకాల బిర్యానీలపై ఎవరికి మక్కువ ఉండదో చెప్పండి. ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది.

సాధారణంగా ఒక చికెన్ బిర్యానీ తినాలంటే కనీసం రూ.180 వరకు ఖర్చవుతుంది. కానీ,ఇప్పుడు ఒక ప్లేట్ బిర్యాని ధర అమాంత 250 కి పెరిగిపోయింది. అవునండి..నిజం..అఫ్గాన్ నుంచి మసాలా దినుసుల దిగుమతులు నిలిచిపోవడంతో ఇక్కడ వాటి ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో జులైతో పోలిస్తే ఆగస్టులో వాటి ధర అతి భారీగా పెరిగింది. గత నెలలో సాజీరా కిలో రూ.380 ఉండగా.. ఇప్పుడు రూ.600కి చేరింది. అంజీరా రూ.650 నుంచి రూ.1400, బ్లాక్ అఫ్రికాట్స్ రూ.300 నుంచి రూ.700, గ్రీన్ అఫ్రికాట్స్ రూ.300 నుంచి రూ.750 వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్ బిర్యానీ ధరలను తయారీదారులు పెంచేశారు.

బిర్యానీ తయారీలో వినియోగించే మసాలా దినుసులు ఎక్కువగా అఫ్ఘానిస్తాన్ నుంచే దిగుమతి చేసుకుంటాం అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఇండియాకు పూర్తిగా దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటి ధరలు పెరగడంతో రెస్టారెంట్ల యజమానులు సైతం బిర్యానీ ధరను ఏకంగా రూ.100కి పైగా పెంచేశారు. ఇది నిజంగా బిర్యానీ ప్రియులకు షాకింగ్ అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news