Gossipsఆ హీరోయిన్ ని కావలనే దూరం పెడుతున్న ప్రభాస్.. ఎందుకొ తెలుసా..??

ఆ హీరోయిన్ ని కావలనే దూరం పెడుతున్న ప్రభాస్.. ఎందుకొ తెలుసా..??

ప్రభాస్.. ఆరు అడుగుల అందగాడు.. హైట్ కు తగ్గ వెయిట్.. ఆ కటౌట్ చూసి పడిపోని అమ్మాయి అంటూ ఉంటుందా..పెళ్ళి అయిన ఆంటీలకు కూడా ప్రభస్ అంటే క్రష్ ఉండనే ఉంటుంది..ఈ కండల వీరుడు ని చూసి ఎలాంటి వారైనా సరే.. ఏమున్నాడు రా బాబు అని అనాల్సిందే. యావత్‌ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘​డార్లింగ్‌’ అని అనిపించుకున్న ఏకైక హీరో మన ప్రభాసే.

చిన్న హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్.. తరువాత మీడియం రేంజ్ హీరోగానూ .. అటు తరువాత స్టార్ హీరోగానూ.. ఇప్పుడు అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు. ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్నవని బడా ప్రజెక్ట్ లే. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే..తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ఒక్కటే ఒక్కటి. అదే మన డార్లింగ్ ప్ర‌భాస్ పెళ్లి.

ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ప్ర‌భాస్ పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అనేక వార్తలు షోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఒక స్టార్ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని ఒక్కరంటే.. మరోక్కరు ఏమో భీమవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 41 సంవత్సరాలు కాగా త‌మ అభిమాన న‌టుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడా..? అన్న ఫ్యాన్స్ ఎదురుచూపులు ఆగ‌డం లేదు. ఇంకోవైపు ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి అని అడిగితే అప్పుడు చేసేందుకు తామంతా రెడీగా ఉన్నామ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మేల్ కేటగిరిలో ప్రభాస్.. ఫీమేల్ కేటగిరిలో అనుష్క ఉంటారు. అయితే ఇద్దరు కలిసి పనిచేయడం.. ఇద్దరిది సూపర్ హిట్ కాంబో కావడంతో ఇద్దరికి పెళ్లి అంటూ ఏవేవో వార్తలు రాసేవారు. ఇద్దరి మధ్య ఉన్న చనువు చూస్తే అది నిజమే అని నమ్మేలా ఉంటాయి. అయితే ప్రభాస్ గురించి అనుష్క.. అనుష్క గురించి ప్రభాస్ ఎప్పుడు డైరెక్ట్ గా పెళ్లి విషయం పై ప్రస్థావించింది లేదు.

ఆన్ స్క్రీన్ పై వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంది. ఇక ఆప్ స్క్రీన్ లో వీరి ఫ్రెండ్ షిప్ గురించి అందరికి తెలుసు. ఇద్దరికి చాలాసార్లు పెళ్లి కూడా చేశారు. ఎప్పటికప్పుడు మా మధ్య ఏమి లేదని చెబుతున్నా సరే ప్రభాస్ గురించి అనుష్కను, అనుష్క గురించి ప్రభాస్ ను అడిగి విసిగిస్తారు.

ఆ విషయాలన్నీ పక్కన బెడితే ఇప్పుడు ప్రభాస్.. అనుష్క విషయంలో పూర్తిగా మారిపోయాడనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అనుష్కను కావాలనే అవాయిడ్ చేస్తున్నాడట. తనకు సంబంధించిన ఊసులు తన చుట్టుపక్కల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలాగే ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలంటే అనుష్క వస్తుందా లేదా అని ఆరాలు తీసి.. తను రాకుంటేనే ఇతను వెళుతున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది.

మరి ప్రభాస్ అనుష్కను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి వెళితే పెళ్లిపై రూమర్స్ వస్తాయనా..? లేక చేసుకోవాలనుకున్న పెళ్లి ఆగిపోయిందా..? లేక ఇంకేదైనా రీజన్ ఉందా..? వీటన్నిటికీ సమాధానం కాలమే చెబుతుంది.

 

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news