Moviesరాశికి "గోకులంలో సీత" ఛాన్స్ రావటానికి కారణం ఎవరో తెలుసా ?

రాశికి “గోకులంలో సీత” ఛాన్స్ రావటానికి కారణం ఎవరో తెలుసా ?

అలనాటి నటి రాశీ గుర్తుంది కదా.. మర్చిపోయే నటా ఆమె.. సీనియర్‌ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తొంభైయవ దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన అందరిలా రాశి. రాశీ.. అప్పట్లో ఈమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రాశీ.

బాలనటిగా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి, మీనల తర్వాత రాశి అని చెప్పవచ్చు. ఈ సొట్టబుగ్గల సుందరి 1990వ దశకంలో అబ్బాయిల కలల సుందరి. చిరు నవ్వుతో అందరినీ ఆకట్టుకుంది. ఈ అచ్చ తెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది

ఇక రాశి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గోకులంలో సీత. ఈ సినిమాలో రాశి పవర్ స్టార్ పవన్ కYఆణ్ పక్కన నటించింది. ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసారు. అయితే రాశి కి ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలుసా..?? దానంతటికి కారణం టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి భార్య సురేఖ నేనట. గోకులంలో సీత సినిమాకి ముందు రాశి శుభాకాంక్షలు సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. రాశి అందం అభినయం నచ్చడంతో ..వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రాశి ఫోటోలని తీసుకుని…గోకులంలో సీత సినిమాలో పాత్రకు రాశి పర్ఫెక్ట్ గా సరిపోతుందని ముత్యాల సుబ్బయ్యకు రికమెండ్ చేశారట. అలా రాశి కి పవన్ కళ్యాణ్ గోకులంలో సీత సినిమాలో అవకాశం వచ్చిన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news