Moviesఆట ఫేం డ్యాన్స్ మాస్టర్ భరత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడొ తెలుసా..??

ఆట ఫేం డ్యాన్స్ మాస్టర్ భరత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడొ తెలుసా..??

ఆట.. జీ తెలుగులో ప్రసారమైన ఈ డ్యాన్స్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది డ్యాన్స్రలకు లైఫ్ ఇచ్చింది. ఇక యాంకర్ ఓంకార్ కెరీర్ ని మలుపుతిప్పింది. ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఈ క్రమంలోనే ఆట కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేజ్ పై ఈయన డ్యాన్స్ చేస్తున్నారు అంటెనే ఆడియన్స్ విజిల్స్ తో సెట్ మారుమ్రోగిపోతాది.

భరత్ చూడటానికి కొద్దిగా లావుగా ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవారు. ఈయన ఎనర్జీ లెవల్స్ వేరే లేవల్ అని చెప్పచ్చు. ఆట ఫ్రోగ్రాంలో శ్రీవిద్యతో కలసి అతను చేసిన డాన్స్ అప్పట్లో ఆట ఫ్రోగ్రామ్ కే హైలెట్ అయ్యేలా ఉండేది. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు.. మంచి ఎనర్జీ ఉంది..కొత్త కొత్త స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు.. సినీ ఇండస్ట్రీలో ఓ టాప్ పోజిషన్ కి వెళ్తాడు అని అనుకునే లోపే.. దేవుడు ఆయన్ని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయాడు.

2015 డిసెంబర్ నెలలో డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో నివాసంలో సూసైడ్ చేసుకున్నారు. ఈ వార్తతో సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. భరత్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటీ కళాకారులు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. భరత్ ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో ఎంతో మానసికంగా క్రుంగిపోయిన భరత్ ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఏదిఏమైనా తెలుగు ఇండస్ట్రీ ఓ మంచి డ్యాన్స్ మాస్టర్ ను కోల్పోయిందనే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news