Moviesజయం చిత్రంలోని ఈ పాప సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?...

జయం చిత్రంలోని ఈ పాప సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? షాక్ అయిపోతారు..!!

జయం.. ఈ సినిమా ఎవరైనా మర్చిపోగలమా.. చెప్పండి..18 ఏళ్ల క్రితం.. బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పటికి టీ వీలో వచ్చినా..ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారు. నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అబ్బో..అప్పట్లో ఈ సినిమా పాటలు ఓ రేంజ్ లో సిని ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికీ ఈ సినిమాకు, పాటలకు మంచి ఆదరణ ఉంటుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ కి చెల్లి పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా..? హా.. గుర్తుంటుందిలేండీ.. మరిచిపోయే నటనా అది.. చేసిన ఒక్క సినిమతోనే మంచి మార్కులు వేయించుకుంది ఆ పాప. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలి సినిమాతోనే మెప్పించిన ఆమె పేరు యామిని శ్వేత. ఈమె ఎవరో కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన జయలక్ష్మి కూతురు. జయం సినిమాలో ఈమె నటన చూసి ఖచ్చితంగా సినీ ఇండస్ట్రిలో ఓ మంచి ప్లస్ కు వెళ్తుంది అని అప్పట్లో అందరు అనేవారు.

కానీ ట్విస్ట్ ఏమిటంటే.. యామిని శ్వేత జయం సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి బాగ చదువుకుని ఓ మచి కంపెనీలో పెద్ద ఉద్యోగం= చేస్తూ.. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యామిని శ్వేత తల్లి మాట్లాడుతూ.. తన కూతురు కేవలం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తే చూడాలని జయం సినిమాలో మాత్రమే నటించేలా చేసిందట.. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని సాగిస్తోంది అంటూ విజయలక్ష్మి తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news