Moviesఈ మేడమ్ గారు జబర్ధస్త్ లోకి ఎలా వచ్చారో తెలుసా..??

ఈ మేడమ్ గారు జబర్ధస్త్ లోకి ఎలా వచ్చారో తెలుసా..??

జబర్దస్త్..పేరు చిన్నదే అయినా.. ఈ పేరే చాలా మంది కమెడియన్స్ కు అన్నం పెట్టింది. వాళ్లలో టాలేంట్ ను కోట్ల మంది ప్రజలకు పరిచయం చేసింది. వాళ్లను కోట్ల రూపాయలు సంపాదించుకునేలా చేసింది. బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఆ తర్వాత బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది జబర్దస్త్ ప్రోగ్రాం. అంతేకాదు ఈ షో ఎంతో మంది కమెడియన్ల కు లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది బాగా సెటిల్ అయ్యారు. అయితే ముందుగా ఈ షోలో లేడీ కమెడియన్లు ఉండేవారు కాదు.. మొగవాళ్ళే లేడీ గెటప్‌‌లు వేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. లేడీ కమెడియన్లు కుడా మొగవాళ్ళకి ధీటుగా స్కిట్లు చేస్తున్నారు. ఇలానే ఇప్పుడు జబర్దస్త్ లో ఓ కొత్త లేడీ ఆర్టిస్ట్ విజృంభించేస్తుంది. ఆమె మరెవరో కాదు. జబర్దస్త్‌‌ పవిత్ర.

 

పవిత్ర… ఈమె చూడ్డానికి నాలుగు అడుగులే ఉంటుంది కానీ అమ్మాయి వేసే పంచులు మాత్రం ఆరడుగుల కంటే పైనే పేలుతుంటాయి. భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తుంది పవిత్ర. ఈమె హైట్‌తోనే ఎక్కువగా కామెడీ పండిస్తున్నారు టీమ్ లీడర్స్. ఇక ఈమె జబర్దస్త్ లోకి ఎలా వచ్చింది, అసలు ఈమె ఎవరు ..అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె కేవలం టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ ను సంపాదించుకుంది.. ఈమె వీడియోలను, జబర్దస్త్ కమడియన్ టీం లీడర్లు చూసి మంచి కామెడి టైమింగ్ ఉండడంతో జబర్దస్థ్ లోకి వచ్చి సెటిల్ అయ్యిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news