Moviesఎన్టీఆర్ ఎంత కట్నం పుచ్చుకున్నాడొ తెలుసా..??

ఎన్టీఆర్ ఎంత కట్నం పుచ్చుకున్నాడొ తెలుసా..??

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కొర‌టాల శివ సినిమాను ఓకే చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా సినిమాతో పాటు ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ఇక కొర‌టాల శివ డైరెక్ట్ చేసే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ – యువ‌సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మిక్కిలినేని సుధాక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఆయన వ్యక్తిగత విషయాలకు వస్తే..ఎన్టీఆర్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావు కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని 2011లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త‌రంలో ఉన్న స్టార్ హీరోలు అంద‌రూ ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఎన్టీఆర్ మాత్రం పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే చేసుకున్నాడు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్ లో వీళ్లు ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఇక ఈ ఇద్ద‌రు దంప‌తుల‌కు ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు పుట్టారు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి త‌ల్లి మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు చంద్ర‌బాబుకు స్వ‌యానా మేన‌కోడ‌లు.

ఇక ఎన్టీఆర్ ఎంత కట్నం పుచ్చుకున్నాడొ తెలుసా..?? మొత్తంగా ఎన్టీఆర్‌కు నార్నే శ్రీనివాస‌రావు రు. 500 కోట్ల క‌ట్నం ఇచ్చార‌ని అప్పట్లో టాలీవు కోడైకూసింది. ఇందులో స్థిర చ‌రాస్తులు చాలానే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌కు భ‌విష్య‌త్తులో కూడా మామ నుంచి భారీ ఆస్తులు వ‌స్తాయ‌ని టాక్‌..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news