Newsతల్లి కాబోతున్న క్రేజీ బ్యూటి..సీక్రెట్ గా దాచిన ఆ హీరోయిన్..ఎందుకో తెలుసా..??

తల్లి కాబోతున్న క్రేజీ బ్యూటి..సీక్రెట్ గా దాచిన ఆ హీరోయిన్..ఎందుకో తెలుసా..??

నటి ఆనంది టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌లో పలు బడా సినిమాలలో హీరోయిన్‌గా నటించి..ప్రేక్షకులతో మంచి మర్కులు వేయించుకుంది. తెలుగులో బస్‌స్టాప్ సినిమాతో తన సినిమా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ భామ.. అంతకుముందే ఈరోజుల్లో అనే మూవీలో స్పెషల్ సాంగ్ చేసి..తనకంటూ ఓ మార్క్ క్రీయేట్ చేసుకుంది. ఇక ఆ తరువాత.. ప్రియతమా నీవచట కుశలమా, నాయక్, గ్రీన్ సిగ్నల్ సినిమాల్లో కొంచెం సేపు కనిపించింది.

అయితే, టాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ..అమడు తగిన గుర్తింపు రాలేదు..మంచి ఆఫర్స్ కూడా రాకపోవడంతో.. ఈ అందాల భామ కోలీవుడ్ లోకి జంప్ అయ్యింది. తెలుగులో ఆశించినంత గుర్తింపు రానప్పటికి..కోలీవుడ్ లో మాట్రం నటి ఆనంది మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్‌లో చేసిన తొలి మూవీ కాయల్‌. అప్పటినుంచి కాయల్ ఆనందిగా మారిపోయింది. ఇక ఆనందికి తమిళంలో క్రేజ్ పెరిగిపోవడంతో దీంతో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. దీంతో ‘జాంబీ రెడ్డి’ సినిమాతో ఆమెను మళ్లీ తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు.

ఇక రీసెంట్‌గా సుధీర్‌‌బాబు హీరోగా వచ్చిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాలో కూడా ఆమె నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంది సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆనంది ఎక్కడ కనపడలేదు..దీంతో ఆమె గురించి ఆరా తీయ్యగా..ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఈ ఏడాది జనవరి 7వ తేదీన ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌నిసడన్‌గా వివాహం చేసుకుని తన అభిమానులకు షాకిచ్చింది. ప్రేమ వివాహం కావడం, అందులోనూ తమిళ సినిమాలకు కో-డైరెక్టర్ కావడంతో ఏ హడావుడి లేకుండా వివాహం చేసుకుందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె గర్భం దాల్చినట్లు.. ఆరో నెల నడుస్తుండటంతోనే సినిమా ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొనడం లేదంటూ ప్రచారం జరుగుతుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news