Moviesఆ ఒక్క మెగాస్టార్ సినిమాతో.. ఈయన జీవితం నాశనం..!!

ఆ ఒక్క మెగాస్టార్ సినిమాతో.. ఈయన జీవితం నాశనం..!!

L.B. శ్రీరామ్.. శ్రీరామ్.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో నటుడిగా ఎన్నో సినిమాలు చేసి..తన నటనతో మన దగ్గర శభాష్ అనిపించుకున్నాడు. సామాన్య కుటుంబంలో ఉండే వ్యక్తి ఎలా ఉండాలో, తను నటించే సినిమాలలో అలాంటి సీన్లలో కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఎల్.బి.శ్రీరాం గా పేరొందిన లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి ఒక నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు.

ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. యూట్యూబులో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందించారు.

L.B. శ్రీరామ్ మంచి నటుడే కాదు.. రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే. ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ లాంటి హిట్ సినిమాలకు రైటర్ గా పని చేశారాయన. డైలాగ్ రైటర్ గా నంది అవార్డులను సైతం అందుకున్నారు. వెండితెరపై చక్కటి కథలను ప్రెజంట్ చేయాలని తపన పడుతుంటారు ఎల్బీ శ్రీరామ్.

ఈయన రాసిన డైలాగులు వల్ల కొన్ని సినిమాలు ఏకంగా భారీ హిట్ ను కూడా సొంతం చేసుకున్నాయి. అలా మంచి పేరు రావడం వల్ల ఒకస్టార్ హీరోకి డైలాగులు రాసే అవకాశం వచ్చింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హీరోయిన్ రంభ, హీరో మెగాస్టార్ కలిసి నటించిన చిత్రం “హిట్లర్”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే.

అయితే ,చిరంజీవి కి ఎంతో పెద్ద హిట్ ఇచ్చిన ఈ సినిమా ఎల్బీ శ్రీరామ్ గారికి శాపంలా మారిందనీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యులో తెలిపారు. హిట్లర్ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారట..కానీ హిట్లర్ సినిమాలో చిరంజీవి కి తక్కువ డైలాగ్స్ ఉండటంతో..ఆయ్నకు ఏ ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో.. ఇక రచయితగా తనకు గుర్తింపు రాలేదని.. ఇంకా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, మంచి గుర్తింపు పొందారు ఎల్.బి.శ్రీరామ్.

 

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news