Gossipsఏయ్.. జింగ్ చక్ జింగ్..ఆ స్టార్ హీరో పక్కన వంటలక్క.. బంపర్...

ఏయ్.. జింగ్ చక్ జింగ్..ఆ స్టార్ హీరో పక్కన వంటలక్క.. బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..?

మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు.

ముఖ్యంగా వంటలక్క పాత్రకి హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ ఉంది. వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఒక్క సీరియల్ తోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సీరియల్ వస్తుందంటే చాలు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి టీవీల ముందు కూర్చుంటారు ప్రేక్షకులు. బుల్లితెర ప్రేక్షకులను అంతలా ఆకర్షించింది ఈ సీరియల్. అయితే త్వరలో వంటలక్క అభిమానులందరికీ గుడ్ న్యూస్ అంద పోతుందా అంటే అవుననే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

తాజాగా ఒక తెలుగు సినిమాకు ప్రేమి విశ్వనాథ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కే నూతన చిత్రంలో ప్రేమి విశ్వనాథ్ కు మంచి రోల్ చేయడానికి వంటలక్క ఓకే చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది.దర్శకుడు లింగు స్వామి ప్రేమి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో వివరించాడట. లింగుసామి చెప్పిన పాత్ర నచ్చడంతో వంటలక్క ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పిందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన వంటలక్క బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి..

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news