Gossipsవామ్మో..ఏంటి సామి ఇది.. ఈ యాంకర్లు అంత పెంచేసారు..?

వామ్మో..ఏంటి సామి ఇది.. ఈ యాంకర్లు అంత పెంచేసారు..?

తెలుగు ఇండస్ట్రీలో వెండితెరపై నటీనటుల పాత్ర సినిమాల్లో ఎంత ముఖ్యమో.. బుల్లితెరపై యాంకర్ ల పాత్ర కూడా టీవీ షోలకు అంత ముఖ్యం. బుల్లితెరపై యాంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ రోజులో వెండితెర తో పాటు బుల్లితెర కూడా దూసుకుపోతుంది అద్భుతమైన రియాలిటీ షోలు స్పెషల్ ప్రోగ్రామ్ లు, సీరియల్స్ తో బుల్లితెర సత్తా చాటుతుంది నిర్మాణ విలువలు కూడా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ తరువాత యాంకర్ లు , టీవీ నటీమణులు బాగా సంపాదిస్తున్నారు. మరి మన బుల్లితెర తారలో ఒక్కోక్కరు ఎంత సంపాదిస్తున్నారో ఒక్కసారి చూసేద్దామా..!!

సుమ కనకాల: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరమే లేదు.ఎన్నో ప్రోగ్రామ్స్, ఫిలిమ్స్, టీవీ షోస్ వంటి వాటిలో యాంకరింగ్ తో బాగా మెప్పించింది. ఇప్పటికీ.. ఇక ముందు కూడా తను ఇండస్ట్రీ లో కొనసాగుతూనే వుంది. సుమ ఒకో ఆడియో ఫంక్షన్ కి 2 నుంచి 3 లక్షల వరకు వాసులు చేస్తుంది ఇక రియాలిటీ షోకి రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తారని తెలుస్తుంది.. ఇక అవార్డు ఫంక్షన్ లు అయితే దాదాపు 5 గంటల నుంచి 6 గంటల పాటు ఉంటాయి వీటికి మరో రేట్ ఉంటుంది కాష్, స్టార్ మహిళా, కనెక్షన్, బలే ఛాన్సెలే వంటి వాటితో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనసూయ: జబర్డస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అనసూయ భర్త సుశాంత్ భరద్వాజ్ ఈయన ఫైనాన్సర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం గ్లామర్ బ్యూటీ క్రేజ్లో ఉన్న యాంకర్ అనసూయ.. అటు వెండితెరపై కూడాఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈమె జబర్దస్త్ షోలో తన యాంకరింగ్ తో బాగా ఆకట్టుకుంటుంది. దాదాపు ఆమె కూడా 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది.

రష్మీ: యాంకర్ రష్మీ గురించి చెప్పాలంటే జబర్దస్త్ తో మంచి ఫేమ్ సంపాదించింది.. ఒక పక్క ఈవెంట్స్ తో పాటు షాప్స్ ఓపెనింగ్స్ తో కూడా సందడి చేస్తుంది దాదాపు ఆమె లక్ష వరకు ఛార్జ్ చేస్తుంది.

శ్రీముఖి : బుల్లితెర లో మరో గ్లామర్ యాంకర్ శ్రీముఖి అని చెప్పవచ్చు. కొన్ని సినిమాల్లో కూడా నటించిన శ్రీముఖి బుల్లితెర షోల్లో యాంకరింగ్ గా బాగా గుర్తింపు పొందింది. తను పటాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆమె కూడా ఒకో ఈవెంట్ కి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుంది.

శ్యామల: శ్యామల బిగ్ బాస్ లో ఎంట్రీ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె భర్త పేరు నరసింహ సీరియల్ నటుడు. యాంకర్ శ్యామల తన రేంజ్ లో ఒకో ప్రోగ్రామ్ కి 50,000 రూపాయలు వరకు వాసులు చేస్తుంది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news