Moviesఒక్కే సినిమా టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు వీరే..!!

ఒక్కే సినిమా టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు వీరే..!!

ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. హీరో,హీరోయిన్,డైరెక్టర్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా కి టైటిల్ కూడా అంతే ముఖ్యం. సినిమా పేరును చూసి ధియేటర్స్ కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం మనం చూసినట్లైతే సినిమాలకి అర్ధంలేని రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ అప్పటి సినిమాలో అలా కాదు సినిమాకి సెట్ అయ్యేలా మంచి అర్ధం వచ్చేలా పేరును ఎంచుకుంటారు. ఈ మధ్యకాలంలో ఆనాటి హిట్ అయిన సినిమా టైటిల్ ని తొందరగా పబ్లిక్ లోకి రిజిస్టర్ అవుతుందని పాత టైటిల్ నే రిపీట్ చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అలాంటిదేమీ లేకుండానే ఓ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఇక మూడు దశాబ్దాల్లో ముగ్గురు టాప్ హీరోల సినిమాలు ఒకే టైటిల్ తో రావడం ఒక విశేషం.

“ఆరాధన” 1962 లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ నిర్మించిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు. బెంగాలీ నవల సాగరిక ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

“ఆరాధన” 1976 లో తెలుగు భాషా ప్రేమ కథా చిత్రం. శ్రీ భాస్కర చిత్ర బ్యానర్ లో అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించాడు. ఈ సినిమాకు బి. వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సాలూరి హనుమంతరావు సంగీతాన్నందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా రికార్డ్ చేయబడింది. ఈ చిత్రం హిందీ చిత్రం గీత్ (1970) కు రీమేక్. హిందీగాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

“ఆరాధన” భారతీరాజా దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, సుహాసిని, రాధిక, రాజశేఖర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కడలోర్ కవిదైగళ్ అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇళయరాజా స్వరపరిచిన ‘అరే ఏమైంది ఈ వయసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది..’ అనే పాట హిట్ అయినా ఆరాధన సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news