Newsకరోనా రాకుండా షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

కరోనా రాకుండా షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!

“కరోనా”.. మూడు అక్షరాల పదం ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతుంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా ధాటికి అల్లాడిపోతుంది అంటే దీని ప్రభావం ఎంతలా ఉందో మనం ఉహించుకోవచ్చు. అయితే దురదృష్టవశాత్తూ ఈ కరోనా కి ఇంకా సరైనా మందు రాలేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు అన్ని కరోనా మీద అంతగా ప్రభావం చూపట్లేదు అని పలువురు ప్రముఖుల నుండి వినిపిస్తున్న మాట.

సో.. ప్రస్తుతం మనం ఉన్న పరిస్ధితుల్లో చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం.

కరోనా మహమ్మారి చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటోంది. నిమోనియా, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చనిపోతున్నవారిలో ఎక్కువ మంది ఈ అనారోగ్యాలు ఉన్నవారే ఉన్నారు. ఇందుకు కారణం ఈ అనారోగ్యాలు ఉన్నవారికి సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అందుకే వారిలో కరోనా వైరస్ త్వరగా పెరుగుతోంది.

డయాబెటిస్ ఉన్న వారికీ కోవిడ్ సోకడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉందని, సంక్రమణ యొక్క తీవ్రత, సార్స్ తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌తో వచ్చే సమస్యల వల్ల ఎక్కువ ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది. చికిత్సల వల్ల ఈ ఇన్ఫెక్షన్ డయాబెటిస్ నియంత్రణను కష్టతరం చేస్తుందని సాక్ష్యాలు సూచిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా, అనియంత్రిత రక్తంలో చక్కెర స్థాయిలు సంక్రమణను నియంత్రించడం మరింత సవాలుగా మారింది.

డయాబెటిస్ మరియు స్థూలకాయం సమస్యలు ఉన్నవారు కరోనా బారిన పడకుండా అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పోల్చితే మధుమేహం, ఊబకాయంతో బాధ పడుతున్న వారికి కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా సమయంలో షుగర్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:

* ఇంట్లోనే ఉండాలి. అనవసరంగా బయటకు వెళ్లకూడదు. ఇంట్లో కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. నడవటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కొన్ని రకాల యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం ద్వారా షుగర్ కాస్త అదుపులో ఉంటుంది.
* టైముకి మందులు వేసుకోవడం, ముందుగానే మందులను నెలకు సరిపడా రెడీ చేసుకోవడం మర్చిపోకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కరోనా సోకితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరిన్ని ఎక్కువసార్లు చెక్ చేసుకోవాలి.
*పోషకాలు లభించే ఆహారం తీసుకోండి. కరోనా వైరస్ సోకిన వారు, కరోనాను జయించినా డీహైడ్రేడ్ అవకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
*ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారానికి బదులుగా, స్వల్ప విరామాలలో కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోండి. తియ్యగా ఉండే పదార్ధాలు, స్వీట్లు మరియు నూనెలో బాగా వేయించిన ఆహారాలు తినకూడదు.
*శరీరంలో వస్తున్న మార్పుల్ని త్వరగా గుర్తించాలి. ముందుగానే రోగాన్ని గుర్తిస్తే త్వరగా ట్రీట్‌మెంట్ పొందే వీలుంటుంది.
*ఒకవేళ షుగర్ లెవల్స్ పెరిగితే డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయొద్దు. అలా చేస్తే కరోనా సోకి నిమోనియా, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటోంది.
*తాజా ఆకుకూరలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
*మూడు చక్కటి ప్రణాళికతో కూడిన భోజనం, మధ్యలో రెండు సార్లు స్నాక్స్ తీసుకోవడం మంచిది. రాత్రి 9 గంటల తరువాత ఏమి తినొద్దు. పడుకునే ముందు ఒక కప్పు పాలు తాగండి.
*పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీ చేతులను తరచుగా శుభ్రపరచుకోవాలి. ఇతరులతో భౌతికదూరాన్ని పాటించాలి మరియు ఇంటి నుంచి బయటకు వెళ్లిన్పుడు ముఖానికి ఫేస్ మాస్క్ ధరించండి.
*అయితే మరీ ఎక్కువ వ్యాయామాలు చేస్తే కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన శరీరానికి ఆక్సిజన్ స్థాయి మరింత అవసరం అవుతుంది.
*కాబట్టి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news