Newsషాకింగ్: గర్భంలో ఉన్న శిశువుకు గర్భం..రీజన్ తెలిస్తే..మైండ్ బ్లాకే..!!

షాకింగ్: గర్భంలో ఉన్న శిశువుకు గర్భం..రీజన్ తెలిస్తే..మైండ్ బ్లాకే..!!

ప్రపంచమంతటా ఓ వైపు కరోనావైరస్ పట్టిపీడిస్తుంటే.. మరోవైపు వింత వింత సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ భూమిపై రోజుకో వింత జరుగుతుంది..అయితే తాజాగా మరో వింత ఘటన చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో… ప్రపంచంలోని ఒక్కో మూలాన.. ఒక్కో వింత చోటుచేసుకుంది.

అయితే తాజాగా వైద్యరంగం లోనే… మరో అద్భుతం చోటు చేసుకుంది. వైద్య రంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఈ నవజాత శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటం వైద్యులు గుర్తించారు.

ఈ ఘటన ఇజ్రాయెల్‌లోని ఆష్‌డోడ్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రసవ సమయానికి ముందు గర్భిణికి ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలు జరిపిన వైద్యులు.. గర్భంలోని ఆడశిశువు పొట్టభాగం సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. దీంతో పుట్టిన‌ అనంతరం చిన్నారికి వైద్యులు ఆల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. అప్పుడు ఆ శిశువు కడుపులో ఒకటికన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఈ శిశువులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. మనిషి రూపాన్ని సంతరించుకున్న ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా అభివృద్ధి చెందాయంట. వైద్యులు సర్జరీ చేసి పిండాలను తొలగించి శిశువుకు వైద్యం అందిస్తున్నారు. ఇలాంటివి చాలా అరుదుగా 10 లక్షల మందిలో ఒకరిలో కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. తల్లి గర్భంలో కవల పిండాలు తయారవుతున్న సమయంలో కొంత వృద్ధి చెందిన పిండంలోకి మరోకటి వల్ల ఇలా జరుగుతుందని శిశువుల విభాగం డైరెక్టర్‌ ఓమర్‌ గ్లోబస్‌ వివరించారు.

 

Latest news