Gossipsఅమ్మో.. ఈ అమ్మడు నెల సంపాదన తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు..!!

అమ్మో.. ఈ అమ్మడు నెల సంపాదన తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు..!!

కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఛ‌లో, గీతా గోవిందం చిత్రాల‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన కన్నడ సోయగం రష్మిక మందాన ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది. ర‌ష్మిక ఇప్పుడు తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతిలో కలిగిన హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా రష్మిక మందన పేరు ఎక్కువగా వినబడుతోంది.

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” అనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” సినిమాలో నటిస్తుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డికి వ‌రుస‌గా హిందీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ పంట మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్న పరిస్థితి. ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో.. అమితాబ్ బచ్చన్ గుడ్ బాయ్లోనూ కీలక పాత్రను పోషిస్తోంది. “గుడ్‌బై” చిత్రం తండ్రి-కూతుర్ల కథతో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సూపర్ 30’ ఫేమ్ వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో కూడా ఇటీవలే కార్తీ జోడీగా చేసిన సుల్తాన్ సినిమా తో పరిచయమై అక్కడ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెండు చేతులా సంపాదిస్తున్న రష్మీక సినిమాలు, బ్రాండ్లు, టీవీ కమర్షియల్స్ ద్వారా 35 కోట్ల దాకా సంపాదించిందట. ఇక ఆమె నెలసరి సంపాదన 4 కోట్ల నుంచి ఐదు కోట్ల దాకా ఉంటుందని టాక్ . ఏదేమైనా ప్రస్తుతం రష్మిక అన్ని భాషలలో నటిస్తూ దేశంలోనే పెద్ద హీరోయిన్ గా అందరిలో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news