Moviesరష్మిక కి ఆయన అంటే పిచ్చ పిచ్చ ఇష్టమట..ఎందుకొ తెలుసా..?

రష్మిక కి ఆయన అంటే పిచ్చ పిచ్చ ఇష్టమట..ఎందుకొ తెలుసా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో అందాల భామ రష్మిక మందన ఒకరు అనే చెప్పాలి. టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి సక్సెస్ ను సొంతం చేసుకు కోవడంతో పాటు అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి..

దీంతో ఆతర్వాత క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించి.. తన కెరీర్ కు ప్లస్ గా మార్చుకుంది. అమ్మడు లక్ బాగుండటంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకెముంది ప్పప వెనక్కి తిరిగి చూసుకునే పనే లేకుండా పోయింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామకు తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి. మళ్లి ఈ అమ్మడుకు అదృష్టం తలుపు తట్టింది. ఆతర్వాత ఏకంగాసూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ దక్కించుకుంది రష్మిక.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ తో జత కట్టి.. అందం అభినయంతో కుర్రాళ్ళమనసు దోచేసింది ఈ కన్నడ బ్యూటీ. ఇప్పటివరకు కన్నడ తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లోను సత్తా చాటడానికి సిద్దమైంది. రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు ఓకే చెప్పి సంతకాలు చేసింది. మరో వైపు తమిళంలో కూడా వరుసగా సినిమాలను చేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే కార్తి హీరోగా నటించిన సుల్తాన్ సినిమాతో అక్కడ అడుగు పెట్టింది రష్మిక. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది.

అయితే , రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమట. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారట. షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతానని తెలిపింది ఈ బ్యూటి. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ” మీ ఫెవరేట్ క్రికెటర్ ఎవరు..? ” అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే రష్మిక ” నా హీరో మహేంద్ర సింగ్ ధోనీ ” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందాన. ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ అంటే పడి చచ్చిపోతానని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక బన్నీ సరసన పుష్ఫ సినిమాలో నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news