Moviesగోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న NTR ముద్దుగుమ్మ .. ఆ సినిమా...

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న NTR ముద్దుగుమ్మ .. ఆ సినిమా చేసుంటే టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉండేది..!!

సదా..ఈ పేరు గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన ‘జయం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ సదా. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో బాగా ఫేమస్ హీరోయిన్ అయింది. జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో తనదైన ఆకట్టుకున్న హీరోయిన్ ’సదా’. ‘జయం’తో టాలీవుడ్‌కి పరిచయమైన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 40కు పైగా చిత్రాల్లో నటించారు.

తమిళంలో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అపరిచితుడు’ సినిమా కథానాయికగా సదాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,మంచు మనోజ్ ల సరసన నటించిన ఈ ముంబై బ్యూటీ.. కీలకమైన చంద్రముఖి మూవీ మిస్సయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి మూవీలో నయనతార హీరోయిన్ గా చేసి,ఇప్పుడు టాప్ హీరోయిన్ అయింది.

నిజానికి సదాకి వచ్చిన ఛాన్స్ అనివార్య కారణాలతో వదిలేసుకొని ఆతర్వాత చాలా బాధ పడిందట. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలా అవుతుందో చెప్పడం కష్టమే అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమే. ఒక్క వేళ ఈ చంద్రముఖి సినిమా సదా కనుక తీసుంటే.. సదా కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేది. రజిని పక్కన మంచి ఛాన్స్ మిస్ చేసుకుని సదా చాలా తప్పుచేసింది.. లేకుంటే టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉండేది. కెరీర్ బాగుండేది. టైం ఏం చేద్దాం.. రాసిన రాతను ఎవరు తప్పించగలరు చెప్పండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news