Gossipsభర్త కు ఊహించని షాక్ ఇచ్చిన చందమామ....ప్రభాస్ కోసం మాట తప్పిన...

భర్త కు ఊహించని షాక్ ఇచ్చిన చందమామ….ప్రభాస్ కోసం మాట తప్పిన కాజల్..!!

రెబల్​స్టార్ ప్రభాస్​ కాజల్ అగర్వాల్ జోడీకి హిట్​ అండ్ లవ్​లీ పెయిర్​ అని గుర్తింపు ఉంది. వారిద్దరూ కలిసి రెండు సినిమాల్లోనే నటించినా, అభిమానుల మనసుల్లో మాత్రం అలా ఉండిపోయారు. డార్లింగ్(2010), మిస్టర్ ఫర్​ఫెక్ట్(2011) మాత్రమే జంటగా చేసిన వీరిద్దరూ.. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి తెర పంచుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ఇప్పటికే చిరంజీవితో ఆచార్య, కమల్‌హాసన్‌తో ఇండియన్‌-2 చిత్రాలు చేస్తున్న కాజల్‌ ఇప్పుడు మరో పాన్‌ ఇండియా ప్రాజెక్టులో కనిపించనుందట. కథల ఎంపిక విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచిస్తున్న కాజల్‌…ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. ప్రభాస్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌లో చిందేయడానికి ఈ చందమామ ఒప్పుకున్నట్లు సమాచారం.

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది కాజల్. పక్కలోకల్ అంటూ ప్రేక్షకులను పిచ్చేక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని తెలుస్తుంది.

ప్రశాంత్​నీల్​ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్​ మూవిలో కాజల్​ స్పెషల్​ సాంగ్​ చేయబోతున్నట్టు టాక్​. ఈ పాటలో కాజల్​ అందాల ఆరబోత కూడా ఎక్కువగానే ఉంటుందట. గతంలో జనతా గ్యారేజ్​లో ఓ స్పెషల్​ సాంగ్​ చేసింది కాజల్​. తాను కేవలం జూనియర్​ ఎన్టీఆర్​ కోసం ఈ పాటలో నటించానని.. ఇక ముందెప్పుడు ఐటమ్​ సాంగ్ లో నటించబోనని కాజల్​ చెప్పింది. అయితే ప్రస్తుతం ప్రభాస్​ కోసం కాజల్​ మాట తప్పందని టాక్​ వినిపిస్తోంది. దీంతో కాజల్ భర్త గౌతం కిచ్లు షాక్ అయ్యాడట .

యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ‘సలార్​’లో ప్రభాస్​ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news