Moviesఈ జంట విడిపోవడానికి రీజన్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..ఎందుకంటే..??

ఈ జంట విడిపోవడానికి రీజన్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..ఎందుకంటే..??

సినీ ఇండస్ట్రీలో ప్రేమ జంటలు ఎక్కువే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే మరి ఎక్కువ. బాలీవుడ్ హీరోల్లో డిఫ‌రెంట్ స్టైల్‌లో ల‌వ్ జ‌ర్నీని కొన‌సాగించిన వాళ్లకు కొద‌వేమి లేదు. ఇద్దరూ స్టార్స్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చేలోపు.. బ్రేకప్ అంటూ టాక్ వినిపించేస్తుంది. ఇలా ఇప్పటికే ఎన్నో జంటలు పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేప్పుకున్నాయి. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటాడు బాలీవుడ్ బ్యాడ్ బాయ్షాహిద్ కపూర్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షాహిద్ కపూర్‏ గర్ల ఫ్రెండ్స్ జాబితా కాస్తా పెద్దగానే ఉంటుంది. బాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు. దాదాపు ఆయనతో నటించిన ప్రతి హీరోయిన్ తో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా చేశాడంటూ గాసిప్స్ వచ్చేవి. షాహిద్ కపూర్ ఎంతో మందితో ఎఫైర్లు పెట్టుకున్నట్లుగా పుకార్లు అప్పుడు షికార్లు చేశాయి.

అయితే షాహిద్ ప్రేమాయ‌ణం న‌డిపిన హీరోయిన్లలో చాలా మంది పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. తాను క‌లిసి న‌టించిన హీరోయిన్ల‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు షాహిద్ క‌పూర్ త‌ర‌చూ ఏదో ఒక వార్త‌ల్లో నిలిచి బాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ గా మారిపోయాడు… ఇప్పుడు తెరపైకి మరోసారి బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్.. హీరోయిన్ విద్యా బాలన్ లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. విద్యాబాలన్, షాహిద్ కపూర్ “కిస్మత్ కనెక్షన్” అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.ఆ సినిమా ద్వారానే షాహిద్ కి విద్యాబాలన్ పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మద్య స్నేహం చిగురించింది.ఇక ఆ స్నేహం కాస్త వారికి గాడమైన ప్రేమగా మారింది.. ఆ సినిమా తర్వాత కూడా ఇద్దరు చాలా డీప్ గా లవ్ చేసుకున్నారట.

షాహిద్, విద్యాబాల‌న్ పెండ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకునే లోపే వారి బ్రేక‌ప్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. షాహిద్‌క‌పూర్ దురుసుత‌నం వ‌ల్ల ఇద్ద‌రికీ బ్రేక‌ప్ అయ్యింద‌ని వారి స‌న్నిహితులు చెప్పుకొచ్చారు. షాహిద్ ఎంతో ప్రేమగా ఉన్నా కూడా విద్యా బాలన్ ను పదే పదే ఎగతాళి చేసినట్లుగా మాట్లాడేవాడట. షాహిద్ ప్రతిసారి విద్యా బాలన్ వెయిట్ గురించి అవహేళన చేసినట్లుగా మాట్లాడేవాడట. అయితే ఆ మాటలతో విద్యా బాలన్ కు చాలా బాధ కలిగించేవాట. అలా చాలా సార్లు షాహిద్ ఆమెను కించపరుస్తూ మాట్లాడం వలనే విద్యా అతడికి దూరం కావాలనుకుందట. మనసు బాధ పడే విధంగా షాహిద్ మాట్లాడటం వల్లే ఈ రిలేషన్ లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశానంటూ ఓ ఇంట‌ర్య్వూలో షాహిద్ క‌పూర్ గురించి చెప్పుకొచ్చింది విద్యాబాల‌న్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news