Moviesఈ హీరోయిన్స్ ఏం చదివారో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!!

ఈ హీరోయిన్స్ ఏం చదివారో తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..!!

సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోహీరోయన్లకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని పరిశ్రమలో ఓ వెలుగువెలుగుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా స్టార్లుగా ఎదిగిన మన హీరోహీరోయిన్లు ఏం చదివారనేది తెలుకోవాలని అందరికి ఆసక్తిగా ఉంటుంది.

అయితే, ఒకప్పుడు ఫిలిం స్టార్స్‌ అంటే పెద్దగా చదువు సంధ్య లేని వారు అన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారంతా ఉన్నత చదువులు చదివిన తరువాతే వెండితెర మీద అడుగుపెడుతున్నారు.

వెండితెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు కూడా పెద్ద చదువుల తరువాతే సిల్వర్‌ స్క్రీన్‌ అరగేంట్రం చేస్తున్నారు. టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు వెండితెర మీద అందాలు ఆరబోయటమే కాదు, కాలేజ్‌లలోనూ మంచి మార్కులు సాధించి బెస్ట్ స్టూడెంట్స్‌ అనిపించుకున్నారు. అయితే ఈ పరిశ్రమలో రాణించాలంటే చదవును పక్కన పెట్టాలనేది ప్రతిఒక్కరి ఉద్దేశం.

అయితే మన స్టార్లలో చదువును మధ్యలో ఆపేసి పరిశ్రమలో సెటిలైయిపోయిన వారు కొందరు ఉంటే డిగ్రీ పట్టాలు పుచ్చుకుని ఇండస్ట్రీలో స్టార్‌లుగా ఎదిగిన వారున్నారు. మరీ మన స్టార్‌ హీరోయిన్‌లు ఏఏ డిగ్రీలో పట్టాలు తీసుకున్నారో ఇక్కడ ఓ లుక్కేయండి.

Nayanatara:
సౌత్‌లో నెంబర్ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నయనతార ఉన్నత చదువుల తరువాతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మార్తోమా కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Kajal Agarwal:

లక్ష్మీ కళ్యాణం మూవీతో తెలుగు తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్‌ అగర్వాల్‌. తక్కువ కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన కాజల్‌ ముంబైలోని కేసీ కాలేజీ నుంచి మాస్ మీడియాలో మార్కెటింగ్ అండ్ అడ్వ‌ర్టైజింగ్ స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ పూర్తి చేసింది.


Anushka Shetty:
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అందాల భామ అనుష్క. యోగా టీచర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ కార్మెల్‌ కాలేజీలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

Sruthi Hassan:
ముంబైలోని సెయింట్ ఆండ్రీవ్ కాలేజీ నుంచి సైకాల‌జీలో డిగ్రీ పూర్తి చేసింది. క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాస‌న్‌ న‌టిగా, సింగ‌ర్ గా, మ్యూజిక్ కంపోజ‌ర్ గా టాప్ పొజిష‌న్‌లో ఉంది.

Rakul Preet Singh:
హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన జీస‌స్ అండ్ మేరీ కాలేజీ నుంచి మేథ‌మెటిక్స్‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది.


Samantha:
సౌత్ టాప్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్న పాత్రలతో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ చెన్నై స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.


Tammanah Bhatia:
మిల్కీ బ్యూటీ తమన్నా ఫీల్డ్ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అంతేకాదు తన కాలేజ్‌ డేస్‌లోనే పలు షోస్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పలు భాషల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.


Shreya seran:
సీనియర్ హీరోయిన్‌ శ్రియ లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ చేసింది.

Sai Pallavi:
తెలుగు, త‌మిళ‌, మ‌లయాళంలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న సాయి పల్లవి నటనకు ముందు జార్జియాలోని బిలిసి మెడిక‌ల్ స్టేట్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత కొంతకాలం ట్రైనీ డాక్ట‌ర్ కూడా ఆమె పనిచేసింది.


Trisha:
సీనియర్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి రాకముందు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలనుకున్నారు. కానీ ఆమె చెన్నైలోని ఎథిరాజ్‌ కాలేజ్‌ నుంచి బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news