Gossipsసూర్య వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ కు ఈ అమ్మడు ఎంత...

సూర్య వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ కు ఈ అమ్మడు ఎంత తీసుకుందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మందికే పరిచయం ఉన్న పేరే. ముఖ్యంగా యూట్యూబ్‌ను రెగ్యులర్ చూస్తుంటే షణ్ముఖ్ ఎవరో ఇట్టే చెప్పేస్తారు.. ఇతనో సోషల్ మీడియా స్టార్. షణ్ముక్ జస్వంత్ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, డాన్స్ వీడియోలతో అద్దరగొట్టేసాడు. మనోడు ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్‌లు తీసీ చాలా ఫేమస్ అయ్యాడండోయ్.

ఇక షణ్ముఖ్ జస్వంత్..ప్రధాన పాత్రలో వచ్చిన సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ఎంతలా ప్రజాదరణ పోందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత షణ్ముఖ్ మరో వెబ్ సిరీస్ తీసాడు. అదే.. సూర్య. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రేండింగ్ నెంబర్ 1 ఉంది అంటే అది సూర్య వెబ్ సిరీస్.

ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి రిలేటెడ్ గా ఉంటూ ప్రతి ఎపిసోడ్ ట్రేండింగ్ నెంబర్ 1లో ఉంటూ రికార్డులు బద్దలు కొడుతుంది సూర్య వెబ్ సిరీస్. ఇక ఈ వెబ్ సిరీస్ లో సూర్యగా షణ్ముఖ్ జస్వంత్ నటిస్తే.. హీరోయిన్ గా మౌనిక రెడ్డి నటిస్తుంది.

మిడిల్ క్లాస్ బాయ్ ఫ్రెండ్ కోసం సంపాదించిన జీతం మొత్తం అతని చేతులో పెట్టి సూపర్ గర్ల్ ఫ్రెండ్ గా నిలిచింది.

ఇక అలాంటి మౌనిక రెడ్డి రీల్ లో ఎంతో ట్రెడిషనల్ గా ఉన్న.. రియల్ గా మాత్రం హాట్ హాట్ గా ఉంటుంది. ఇక మౌనిక రెడ్డికు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. హైదరాబాద్ హెచ్‌జి‌ఎస్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే వెబ్ సిరీస్‌లో అవకాశాలు రావడంతో ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా 17 ఎపిసోడ్స్‌లో నటించి.

అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ అమ్మడు. అయితే ఆపై రెండేళ్లకు జాబ్‌కు రిజైన్ చేసి.. వెబ్ సిరీస్ సూర్య.. షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి నటించి అందరి దగ్గర శభాష్ అనిపించుకుంది. ఇక ఇందులో తన నటనకు గాను మౌనిక ఒక్కో ఎపిసోద్ కు దాదాపు లక్ష రూపాయలు దాక తీసుకున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news