Gossipsవీళ్లు పెళ్లి స్కిట్ చేసినందుకు ఎంత తీసుకుంటారో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది..!!

వీళ్లు పెళ్లి స్కిట్ చేసినందుకు ఎంత తీసుకుంటారో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ది..!!

రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుండి పరిచయమయ్యారు రష్మీ, సుధీర్. రష్మీ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్టార్ కమెడియన్ గా నిలిచి వెండితెరపై కూడా మెప్పించాడు సుడిగాలి సుధీర్. టెలివిజన్ లో వచ్చే షోలలో సుధీర్, రష్మి ఉంటే.. టీఆర్పీ రెటింగ్ దూసుకుపోతుంది.

బుల్లితెరపై బోర్ కొట్టని అంశం ఏదైనా ఉందంటే అది సుధీర్ రష్మీ. గత ఎనిమిదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఈ జోడి అలరిస్తూనే ఉంది. సుధీర్ రష్మీ జోడికి నెట్టింట్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీళ్ళ మధ్య ఉన్న బంధం చూసినట్లయితే వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానం వస్తుంది. నిజానికి వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ వినిపించింది. ఈ షో లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమౌతున్న పలు షోలలో కూడా బాగా రచ్చ చేస్తుంటారు. ఇక గతంలో బుల్లితెర వేదికగా వీరి పెళ్లి కూడా చేశారు.

అయితే ఇక తాజాగా ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది, దీపికా పిల్లి తో పాటు, సుధీర్ – రష్మీ ల పెళ్లి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక వీరందరూ కలిసి ఈ స్కిట్ చేయడానికి ఎంత పారితోషకం తీసుకున్నారనే విషయం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ స్కిట్ చేయడానికి వీరు అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news