Healthఒక్క ముద్దు తో ఎన్ని క్యాలరీలు కరిగించవచ్చో తెలుసా..??

ఒక్క ముద్దు తో ఎన్ని క్యాలరీలు కరిగించవచ్చో తెలుసా..??

“ముద్దు” అనేది బూతు కాదు. ప్రేమను వ్యక్తం చేయాలన్నా.. రొమాన్స్‌ను మొదలు పెట్టాలన్నా ‘ముద్దు’ ఉండాల్సిందే. తమకు నచ్చిన వ్యక్తిపై ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే ముద్దు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. ముద్దు ఇద్దరి మధ్య ప్రేమను మాత్రమే కాదు.. సెక్స్‌వల్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. హార్మోన్లను ప్రేరేపించి చక్కని సెక్స్ లైఫ్‌కు చుక్కానిలా మారుతుంది. అందుకే ముద్దు ఎప్పుడూ చేదు కాదని అంటారు.

ఇక ప్రేమ‌లో ఉన్న‌వారు.. పెళ్ల‌యిన ఆలుమగలు ముద్దుని ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తొలిముద్దు, అంద‌రూ ఉన్న‌ప్పుడు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పెట్టుకున్న ముద్దు, మొద‌టి గాఢ‌మైన ముద్దు.. ఇలా ప్ర‌తి ఒక్క‌టీ ప్ర‌త్యేక‌మైందే. ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా.. మీ బంధాన్ని మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చేదిగా ముద్దు ఉంటుదంటే అతిశ‌యోక్తి కాదు. అయితే, ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో కొన్ని కేలరీలు ఖర్చవుతాయి.

ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి. ఎక్కువ సేపు ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో సుమారు 8 నుండి 16 కేలరీలను కరిగిస్తుందని నిపుణుల అధ్యయణంలో తేలింది. మీ శరీరంలోని కేలరీలను కరిగించడానికి ముద్దు పెట్టుకోవడం వ్యాయామంగా కూడా పనిచేస్తుందట.

ఒక జర్మన్ అధ్యయనం ప్రకారం, ఆఫీస్కు బయలుదేరే ముందు భార్యల నుండి మంచి ముద్దు పొందిన భర్తలు ఎక్కువ డబ్బు సంపాదించారని తేలింది. దీనికి గల కారణం ముద్దు వల్ల మానసిక ఉల్లాసం రావడంతో పాటు అతను పనిలో ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటాడని తేలింది. ముద్దు మీ ఆత్మగౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రియమైన వారితో కనెక్ట్ కావడానికి మంచి అనుభూతినిస్తుందట.

Latest news