Moviesఅమ్మ బాబోయ్..సైలెంట్ షాక్ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.. ఏం చేసిందో చూడండి...

అమ్మ బాబోయ్..సైలెంట్ షాక్ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ.. ఏం చేసిందో చూడండి ..!!

నిత్యా మీనన్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరు చెప్పగానే మనకు ముందు గుర్తు వచ్చేది స్మైల్. ఎప్పుడు నవ్వుతూ అందరిని ఆటపట్టిస్తూ.. చాలా చలాకిగా ఉంటుంది ఈ అమ్మడు.ఈమెలోని ప్లస్ పాయింట్ నాటురల్ యాక్టింగ్. ఈమె యాక్టింగ్ ఎంత నాటురల్ గా ఉంటుందంటే.. పెద్ద పెద్ద హీరోలు సైతం ఈమె నటనకు ఫిదా అవుతుంటరు. నిజానికి ఈమె పేరుకు మళయాల ముద్దుగుమ్మ అయినా కూడా తెలుగులోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. అలా మొదలైంది సినిమాతో కెరీర్ మొదలు పెట్టి ఇక్కడ కూడా చాలా మంచి మంచి సినిమాల్లో నటించింది.

టాలీవుడ్ లో ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తొలి సినిమాతోనే నటిగా తనదైన ముద్ర వేసింది. నిత్యం టాలీవుడ్ లో మరో సౌందర్య అనిపించుకునే ఈ అమ్మడు అందరి కంటే భిన్నంగా మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. నిజానికి ఈమె కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలే అయిన నిత్య తన బ్రాండ్ చూపించింది అనే చెప్పాలి.

అయితే టాలీవుడ్ లాంటి కమర్షియల్ సినిమా పరిశ్రమలో రాణించాలంటే ఎంతో కొంత గ్లామర్ షో చేయాలి. అలా చేసిన వారు ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ లు గా ఎదిగారు. కానీ నిత్యమీనన్ ఈ ఒక్క కారణంగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగ లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. కాగా, నిత్యా మీన‌న్ కొంత‌కాలంగా తెలుగు సినిమాల్లో పెద్ద‌గా క‌న‌ప‌డ‌టం లేదు. అయితే,పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది.

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా.. రానా ఒక కీలక రోల్ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ట్రెండింగ్ లో ఉంచేందుకు ట్రై చేస్తోంది.

ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ల పేర్లు ఇప్పటి వరకు బయటకుచెప్పని యూనిట్.. తాజాగా నిత్యా మీనన్ పేరును అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ మూవీలో నిత్యా మీనన్ నటిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈరోజే అనౌన్సమెంట్ తో ప్రొడక్షన్ నెం 12కి వెల్కమ్ అంటూ నిత్యాకు స్వాగతం పలికారు. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కి జోడీగా నిత్యా నటిస్తుండగా రానా కి జోడీగా ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేస్తున్నట్లు టాక్.

 

 

Latest news