ఆదిపురుష్‌లో హ‌నుమంతుడిగా యంగ్ క్రేజీ హీరో..!

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదల కానుంది. ఇక మరో పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమా కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది.

అంతేకాకుండా.. స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్’ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ రామాయణం నేపథ్యంలో ఏకకాలంలో హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న సినిమా. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా మొదలైన దగ్గరనుంచి ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆదిపురుష్‌లో హనుమంతుడి పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు ఫైనల్ చేసారట. త్వరలోనే ఈ ప్రకటన రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరాఠీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి దేవదత్ పేరు ప్రస్తుతం మేకర్స్ లిస్టులో ఉన్నట్లు టాక్.

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా వెల్లడించారు. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించనుండటం విశేషం.