Moviesఅబ్బో!..సురేఖా వాణి తెర వెనుక బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందంతే..!!

అబ్బో!..సురేఖా వాణి తెర వెనుక బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందంతే..!!

సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. ఈమె 1977-6-30 వ తేదీ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టింది. ఈరోజు తన 44 పుట్టినరోజు కావున తన గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీ ఆర్టిస్ట్ సురేఖ వాణి పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో భార్య, వదిన, అక్క, తల్లి పాత్రలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా సురేఖ వాణి అందంతో పాటు ఆకట్టుకునే నటనతో తనదైన ముద్రవేసుకుంది.

యాంకర్ గా కూడా చేసింది సురేఖ వాణి. సురేఖ వాణి సినిమాల్లో హోమ్లీ పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

 

సినిమాల్లో సురేఖ వాణి చేసే పాత్రలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చీరలో ఎక్కువగా కనిపించిన సురేఖ వాణి తన పర్సనల్ లైఫ్ లో మాత్రం గ్లామర్ గర్ల్ గా దర్శనమిస్తోంది. కాలేజ్ కి వెళుతున్న కూతురు ఉన్నా కూడా ఆమె ఇంకా యంగ్‌గానే కనిపిస్తోంది. తన గ్లామర్ షోతో నెటీజన్స్‌ని స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే ఆమె భర్త మరణించిన తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. అనంతరం తన కూతురితోనే లైఫ్ ని హ్యాపీగా గడిపేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి సంతోషాల్ని నెటీజన్స్‌తో పంచుకుంటున్నారు.

14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సిటీ కేబుల్ లో యాంకర్ చేసింది ఈ ఆంటీ. తన తండ్రి స్నేహితులకు సిటీ కేబుల్ ఉండేది.. అందులో తన బాబాయ్ కూడా పని చేసే వాడు.. దీంతో అప్పుడప్పుడు సురేఖా వాణి కూడా అక్కడికి వెళ్లడంతో తను కూడా సరదాగా ప్రోగ్రామ్ చేసేది. ఇక అలా తను యాంకరింగ్ నుండి సినిమా ఇండస్ట్రి వరకు వచ్చింది.


ఇక ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా వల్ల బాగా ఫాలోయింగ్ పెంచుకుంది సురేఖ వాణి. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. అంతేకాకుండా తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక తనకు తన ఎత్తు కూతురు ఉండగా తనతో పాటు పోటీగా తయారవుతుంది సురేఖవాణి. ఇక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత తను రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ విషయం గురించి వెంటనే స్పందించి పుకార్లను తోసిపుచ్చింది. ఇదంతా ఇలా ఉంటే ఈమధ్య గ్లామర్ తో మరింత రెచ్చిపోతుందని చెప్పవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news